ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటెక్ పూర్తి కాకుండానే రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఆర్మీలో చేరాలన్న మక్కువతో రిజెక్ట్ చేసి మరీ..

ABN, First Publish Date - 2021-12-10T01:19:37+05:30

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి కూడా బీటెక్ పూర్తి కాకుండానే.. రూ.20లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ వచ్చింది. ఈ స్థానంలో వేరెవరైనా ఉంటే ఎగిరి గంతేస్తారు. కానీ ఇతడు మాత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీటెక్ పూర్తి కాగానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలని చాలా మంది శతావిధాలా ప్రయత్నిస్తుంటారు. కొందరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి, చేసి.. చివరకు విసిగిపోయి దొరికిన పని చేసుకుంటూ కాలం వెల్లదీస్తుంటారు. మరికొందరు మొదటి ప్రయత్నంలోనే మంచి వేతనంతో ఉద్యోగాల్లో చేరిపోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి కూడా బీటెక్ పూర్తి కాకుండానే.. రూ.20లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ వచ్చింది. ఈ స్థానంలో వేరెవరైనా ఉంటే ఎగిరి గంతేస్తారు. కానీ ఇతడు మాత్రం ఆ ఆఫర్‌ను తేలిగ్గా తీసిపారేశాడు. తన జీవిత ఆశయం నెరవేర్చుకునేందుకు ఆర్మీలో చేరాలని కంకణం కట్టుకున్నాడు... వివరాల్లోకి వెళితే..


ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ముందలి గ్రామానికి చెందిన అరుణ్ పుండిర్‌.. మొదటి నుంచీ ఆర్మీలో చేరాలని కలలు కంటూ ఉండేవాడు. ఇతడి తండ్రి ప్రదీప్ పుండిర్.. 18 సంవత్సరాలుగా కోమాలో ఉన్నారు. తల్లి సుధా పుండిర్ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేసేది. అయితే 2016లో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో అతను తీవ్రంగా కుంగిపోయాడు. అయితే ఆర్మీలో చేరాలనే తన ఆశయం కోసం.. తనకు తాను సర్ది చెప్పుకొని ముందుకు సాగాడు. కష్టపడి చదివి బీరట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(MIET)లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. చదువు పూర్తి కాకముందే అతడికి నోయిడాలోని ఓ ఐటీ కంపెనీలో ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే తన ఆర్మీ కలను సాకారం చేసుకునేందుకు.. ఆ జాబ్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత ఖర్చుల కోసం కొన్ని నెలలు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఇంటి వద్ద నుంచే పని చేశాడు.

బుడ్డోడే కానీ.. భలే మంచి పని చేశాడు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..


అరుణ్ పుండిర్‌ మామ సురేంద్రసింగ్ తోమర్ ఆర్మీలో సుబేదార్ మేజర్‌గా చేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. మామ సహకారంతో ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రయత్నాలు ఫలించి.. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూల్లో 5వ స్థానంలో నిలిచాడు. అనంతరం టెక్నికల్ ఎంట్రీ ద్వారా సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యాడు. డిసెంబర్ 12న రిపోర్ట్ చేయాల్సిందిగా అతడికి సమాచారం అందింది. ఇతడి ప్రతిభను గుర్తించిన ఎమ్‌ఐఈటీ చైర్మన్ విష్ణు శరణ్, వైస్ చైర్మన్ పునీత్ అగర్వాల్, డైరెక్టర్ డాక్టర్ మయాంక్ గార్గ్.. అరుణ్‌ను అభినందించారు. అరుణ్ అన్న అభిషేక్ కూడా ఆర్మీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. తల్లిదండ్రులు దూరమైనా కుంగిపోకుండా కష్టపడి చదివి, అనుకున్న లక్ష్యానికి చేరుకున్న అరుణ్.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఒంటెలకు కూడా అందాల పోటీలా..? అని అవాక్కవుతున్నారా..? ఆ పోటీల్లో గెలిచేందుకు యజమానులు చేసే నిర్వాకాలేంటో తెలిస్తే..

Updated Date - 2021-12-10T01:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising