విచిత్ర శబ్దాలు.. స్టేషన్‌లో ఆగిపోయిన రైలు! ఇంజన్ వద్దకు వెళ్లి చూస్తే కంటపడిన షాకింగ్ దృశ్యం!
ABN, First Publish Date - 2021-09-12T22:16:01+05:30
స్టేషన్‌లో అకస్మాత్తుగా ఆగిన రైలు.. ఇంజన్ వద్దకు వెళ్లి చూస్తే షాకింగ్ దృశ్యం
ఇంటర్నెట్ డెస్క్: అది కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు! వేగంగా గమ్యంవైపు దూసుకుపోతోంది. బుర్హాన్‌పూర్ దాటిన తరువాత..రైల్లో ఓ భీతి గొలిపే ఘటన చోటు చేసుకుంది. లోకో పైలట్‌కు రాళ్లు ఎగిరిపడుతున్న చప్పుడు వినిపించింది. ప్రయాణికులకు కూడా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఎవరో రైలుపై రాళ్లు విసురుతున్నారని కొందరు అన్నారు. రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉందని మరికొందరు కలకలం రేపారు. ఈ హంగామా నడుమ..రైలు సాత్‌ఫటా స్టేషన్ వద్ద రైలు ఆగింది. ఇక రెండు గంటల పాటు ఇక్కడే హాల్ట్ తప్పదంటూ కొందరు రైలు ప్రయాణికులు నిట్టూర్పులు వదిలారు.
ఇవీ చదవండి..
ఆమెకు డబ్బులు అవసరం! అతడేమో ఇంటికొస్తే అప్పు ఇస్తానన్నాడు.. సరేనని వెళ్లిన ఆ మహిళకు..
పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. విడాకుల కేసుల చరిత్రలోనే అనూహ్య పరిణామం..!
ఈ క్రమంలో కొందరు రైలు ఇంజన్ వద్దకు వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. యువతీయువకుల శవాలు రైలు ఇంజన్‌కు వేళాడుతూ కనిపించాయి. ఈ శవాలు రాళ్లకు తాకుతూ వెళ్లడంతో.. రాళ్లు ఎగిరిపడినట్టు అప్పుడు వారికి అర్థైమైంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కాగా..యువతీయువకులిద్దరూ ప్రేమికులై ఉండొచ్చని, ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే..వీరు రైలు కిందపడటం లోకోపైలట్(ట్రెయిన్ డ్రైవర్) కూడా చూడలేదని సమచారం. శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మృతులు ఎవరనే మిస్టరీ ఇంకా వీడలేదు.
Updated Date - 2021-09-12T22:16:01+05:30 IST