ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gannavaram: గన్నవరం రహస్యం

ABN, First Publish Date - 2022-11-18T02:50:38+05:30

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వాసనలు రాష్ట్రంలోనూ గుప్పుమంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజవాడ-ఢిల్లీ చార్టర్డ్‌ విమానాల్లో సూట్‌కేసుల తరలింపు?

వెళ్లేటప్పుడు పెద్దపెద్ద వాటితో..

వచ్చేటప్పుడు ఉత్త చేతులతో!

రాష్ట్ర ప్రభుత్వ కీలక ప్రజా ప్రతినిధి ప్రమేయం

ప్రయాణికులు, లగేజీపై ఈడీ అధికారుల ఆరా

ఎయిర్‌పోర్టులో సీఐఎ్‌సఎఫ్‌ బదులు రాష్ట్ర బలగాల పహారా

గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ ఏజెన్సీ ప్రభుత్వ పెద్దల అనుచరుడిదే

అనుయాయులతో మేనేజ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు

(అమరావతి/విజయవాడ-ఆంధ్రజ్యోతి)

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వాసనలు రాష్ట్రంలోనూ గుప్పుమంటున్నాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి తరచూ ఢిల్లీకి వెళ్లే చార్టర్డ్‌ విమానాల్లో లగేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కీలక ప్రజా ప్రతినిధి ఒకరు తరచూ పెద్ద పెద్ద సూట్‌ కేసులు తీసుకెళ్లడం... తిరిగి వచ్చే సమయంలో ఆ సూట్‌ కేసులు లేకపోవడంపై కూపీ లాగుతున్నట్టు సమాచారం. అంతేగాక బెజవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర సాయుధ బలగాలతో కాకుండా రాష్ట్ర స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కాపలా కాయడం వెనకున్న రహస్యాన్ని వెలికి తీయనున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో కేంద్ర సాయుధ బలగాలు(సీఐఎ్‌సఎఫ్‌) కాపలా ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తప్పనిసరిగా సీఐఎ్‌సఎఫ్‌ పహారా కాస్తుంది. విజయవాడ విమానాశ్రయానికి సెక్యూరిటీగా కేంద్ర బలగాలు పంపాలని గత ప్రభుత్వం మూడేళ్ల క్రితమే కేంద్రాన్ని కోరింది. కేంద్రం సమ్మతించినా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఇప్పటి వరకూ సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు ఇటు రాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారి పర్యవేక్షణలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎ్‌సపీఎఫ్‌) విజయవాడ విమానాశ్రయానికి భద్రత కల్పిస్తోంది.

రకరకాల పేర్లతో అద్దెకు...

విజయవాడ నుంచి తరచూ ఢిల్లీకి చార్టర్డ్‌ విమానాలు వెళుతుంటాయి. నెలకు కనీసం 15కు తగ్గకుండా వెళ్తుండటంతో వాటిలో ప్రయాణించిన వ్యక్తుల వివరాలు ఈడీ సేకరిస్తోంది. ఢిల్లీకి వెళ్లిన వ్యక్తులు తిరిగి అదే చార్టర్డ్‌ విమానంలో తిరిగొచ్చారా? లేదా ప్రయాణికులతో కలిసి సాధారణ విమానాల్లో వచ్చారా? అనే విషయంపై ఆరా తీస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం చార్టర్డ్‌ విమానాల్లో వెళ్లే వ్యక్తులు తీసుకెళ్లిన భారీ లగేజీని సరిగా తనిఖీ చేయడం లేదని తెలుస్తోంది. ప్రయాణించిన వ్యక్తుల పేర్లు కూడా పూర్తిగా కాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటున్నాయని సమాచారం. చార్టర్డ్‌ విమానాలు నడుపుతున్న కనికా రెడ్డి బంధువు కూడా ‘సాయి’ అని ఒకసారి, ‘విజయ్‌’ అని మరోసారి, ‘ఎస్‌.విజయ్‌’ అని ఇంకోసారి, ‘వీఎస్‌ రెడ్డి’ అని కూడా విమానం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ నాయకుడు నేరుగా రన్‌వే పైకి వాహనంలో వెళ్లి భారీ లగేజీతో ఢిల్లీ వెళుతున్నట్లు విజయవాడలో చర్చ జరుగుతోంది. సెక్యూరిటీలో కీలక అధికారి ఇందుకు సహకరించగా, గ్రౌండ్‌ క్లియరెన్స్‌ సిబ్బంది లగేజీ లోపల పెట్టేవారని సమాచారం.

ఆ సంస్థ... కీలక అధికారిదే

విమానయాన సంస్థలు సొంతంగా విమానాశ్రయాల్లో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటాయి. చార్టర్డ్‌ విమానాలకు సొంత గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సిబ్బంది ఉండరు. ఒక పైలట్‌, ఇద్దరు ఎయిర్‌హోస్టె్‌సలు మాత్రమే ఉంటారు. వాటికి గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలు అందించేందుకు ఏఏఐ ఎయిర్‌పోర్టుల ప్రాతిపదికన ఏజెన్సీల కోసం టెండర్లు పిలుస్తుంది. 2021లో ఓ కీలక అధికారికి చెందిన సంస్థ పాల్గొని, 2022లో కాంట్రాక్టును దక్కించుకుంది. ఆయన రాష్ట్ర ఏవియేషన్‌ కార్పొరేషన్‌లో 2019 జూన్‌లో కీలకమైన పదవిలో నియమితులైన ప్రభుత్వ పెద్దల అనుచరుడని తెలుస్తోంది. ఈ ఏజెన్సీకి సోదర ఏజెన్సీ తెలంగాణలో బేగంపేట ఎయిర్‌పోర్టులో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలను అందిస్తోంది. విమానాశ్రయాలలో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలు పలు రకాలు ఉంటాయి. ప్రతి అంశాన్ని చెక్‌ లిస్టు చేసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ, బ్యాగేజీ తనిఖీల తర్వాత లగేజీని విమానాలలో పంపే ముందు వాటి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా పై నుంచి వచ్చిన ఆదేశాలతో విజయవాడ విమానాశ్రయంలో కీలక ప్రజా ప్రతినిధి విషయంలో సిబ్బంది నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని తెలుస్తోంది.

అసాధారణ ఆఫర్‌

ఏఏఐ కోణంలో చూస్తే గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ ఏజెన్సీ ఎక్కువ మొత్తం ఆఫర్‌ చేస్తే దానికి బాగానే ఆదాయం ఉంటుంది. మరో కోణంలో చూస్తే.. ఆదాయానికి మించి ఏఏఐకు ఎక్కువ మొత్తం చెల్లించడం వెనుక పెద్ద రహస్యమే దాగుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ఏజన్సీ ఏఏఐకు ఆఫర్‌ చేసిన దాని ప్రకారం చూస్తే.. సిబ్బందికి జీతాలు చెల్లించటానికే సరిగా సరిపోదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణం సందర్భంలో విజయవాడ ఎయిర్‌పోర్టుకు నెలకు 50కి పైగా చార్టర్డ్‌ విమానాల రాకపోకలు సాగించేవి. అప్పట్లో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ ఏజెన్సీ సంవత్సరానికి రూ.3 లక్షలు చెల్లించేది. ప్రస్తుత ఏజెన్సీ మాత్రం రూ.25 లక్షల మేర చెల్లించటానికి సిద్ధ పడింది. గతంలో మాదిరిగా చార్టర్డ్‌ విమానాలు భారీగా పెరిగాయా అంటే అదీ లేదు. నెలకు సగటున 20 చార్టర్డ్‌ విమానాలు మించి తిరిగే పరిస్థితి లేదు. అయినా.. ఎందుకు ఇంత చెల్లిస్తుంది? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

మంత్రి సిఫారసుతో...

విజయవాడ విమానాశ్రయంలో ఎక్కువ అధికారాలుండే అధికారి కూడా ప్రభుత్వ పెద్దల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, రాయలసీమకు చెందిన ఒక మంత్రి సిఫారసుతో ఆయన్ను నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. తరచూ ఢిల్లీకి వెళ్లే ఆ మంత్రి కేంద్ర కేబినెట్‌లో తెలుగు మాట్లాడే మంత్రి ద్వారా ఈ అధికారిని విజయవాడలో నియమించారని సమాచారం.

Updated Date - 2022-11-18T04:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising