Botsa Satyanarayana: జీతాలు ఆ స్థాయిలో పెరగకపోవచ్చు.. ఉద్యోగ సంఘాలకు బొత్స చురక
ABN, First Publish Date - 2022-11-17T17:38:33+05:30
ఆర్థిక శాఖలో వాళ్ల బాధలు వాళ్లకుంటాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. డబ్బుంటే ఎక్కువ ఇచ్చేస్తారు, ఎఫ్‌ఆర్‌బీఎం దాటకుండా చూస్తారని, చంద్రశేఖర్‌రెడ్డి సేవలు వినియోగించుకోండి, మళ్లీ మనదే అధికారమని బొత్స జోస్యం చెప్పారు.
అమరావతి: ఆర్థిక శాఖలో వాళ్ల బాధలు వాళ్లకుంటాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. డబ్బుంటే ఎక్కువ ఇచ్చేస్తారు, ఎఫ్‌ఆర్‌బీఎం దాటకుండా చూస్తారని, చంద్రశేఖర్‌రెడ్డి సేవలు వినియోగించుకోండి, మళ్లీ మనదే అధికారమని బొత్స జోస్యం చెప్పారు. పదేళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని బొత్స తెలిపారు. 9 ఏళ్లు పూర్తయినవారు కోర్టుకు వెళ్లి స్టే తేకుండా మీరు చూడాలని, సీపీఎస్ విషయంలో ఉద్యోగుల వినతిని మంత్రి బొత్స దాటవేశారు. ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఉద్యోగుల సమస్యలు ఉంటాయని బొత్స ప్రశ్నకు, హామీ ఇచ్చారుగా అని సీపీఎస్ ఉద్యోగులు బొత్సను ప్రశ్నించారు. కూరగాయల ధరలు పెరిగినట్టు... జీతాలు ఆ స్థాయిలో పెరగకపోవచ్చని, వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒకమాట అన్నానేమో గానీ అందరిలో అనలేదని మంత్రి తెలిపారు. ఏమీ అనుకోవద్దు అంటూనే ఉద్యోగ సంఘాలకు బొత్స చురక పెట్టారు.
Updated Date - 2022-11-17T17:48:21+05:30 IST