Chandrababu: అచ్చెన్నాయుడుకు చంద్రబాబు కితాబు

ABN, First Publish Date - 2022-10-29T18:27:30+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)తో ఈ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) భేటీ అయ్యారు. టెక్కలి నియోజకవర్గం, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు.

Chandrababu: అచ్చెన్నాయుడుకు చంద్రబాబు కితాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)తో ఈ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) భేటీ అయ్యారు. టెక్కలి నియోజకవర్గం, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. కుప్పం, మంగళగిరి (Kuppam Mangalagiri), టెక్కలిని వైసీపీ టార్గెట్ చేసిందని, వాళ్లు ఎంత టార్గెట్ చేస్తే అంత ఎక్కువగా బలపడుతున్నామని అర్థమని చంద్రబాబు తెలిపారు. టెక్కలిలో పార్టీ పరిస్థితి బాగుందని కితాబిచ్చారు. వైసీపీ (YCP)పై ఉత్తరాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చంద్రబాబు తెలిపారు. రెండు రోజుల క్రితం నారా లోకేశ్ (Nara Lokesh)తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ‘మంగళగిరి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను బాగా చురుకుగా చేస్తున్నారు. తరచుగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి సొంతంగానే కృషి చేస్తున్నారు. తాజా సర్వే రిపోర్టు సంతృప్తికరంగా బాగానే ఉంది.

అయినప్పటికీ.. ఇంకా పట్టు బిగించే విధంగా పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలి’ అని నారా లోకేశ్‌కు చంద్రబాబు సూచించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని తన నివాసంలో చంద్రబాబు గురువారం మంగళగిరిలో పార్టీ పరిస్థితిపై లోకేశ్‌తో సమీక్షించారు. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరును గురించి పార్టీ అధినేతకు లోకేశ్‌ వివరిం చారు. పార్టీ కార్యక్రమాలన్నింటిపై డాష్‌ బోర్డును చూసి చంద్రబాబు కొన్ని సలహాలు, సూచనలను లోకేశ్‌కు సూచించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పూర్తి సంతృప్తికరంగానే వున్నప్పటికీ మరింత గట్టిగా నియోజకవర్గ వ్యవహారాలపై దృష్టి సారించాలని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2022-10-29T18:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising