Chandrababu: కైకాల సత్యనారాయణ నివాసానికి చంద్రబాబు

ABN, First Publish Date - 2022-12-27T18:13:32+05:30

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వచ్చారు.

Chandrababu: కైకాల సత్యనారాయణ నివాసానికి చంద్రబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణకు చంద్రబాబు నివాళులర్పించారు. కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ మృతి బాధాకరమని, ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ (NTR)తో 100కు పైగా సినిమాల్లో నటించడం అరుదైన రికార్డ్‌ నెలకొల్పారని చెప్పారు. సత్యనారాయణ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియడారు. 1996లో టీడీపీ (TDP) నుంచి ఎంపీగానూ గెలిచారని గుర్తుచేశారు. కైకాల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సత్యనారాయణ మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చాలాకాలంగా బాధపడుతున్న ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 700కు పైగా చిత్రాల్లో నటించిన సత్యనారాయణ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో చాలాకాలంగా వెండితెరకు దూరమై ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, సత్యనారాయణ 101 సినిమాల్లో నటించారు. ఇందులో సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ పోలికలు తనలో కొన్ని ఉండడం సత్యనారాయణ అదృష్టంగా భావించేవారు. ‘అన్నయ్యా’ అంటూ వినయవిధేయతలతో మెలిగేవారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’.

Updated Date - 2022-12-27T18:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising