ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harsha kumar: ఏఐసీసీ ఇచ్చిన పదవిని తిరస్కరించిన మాజీ ఎంపీ

ABN, First Publish Date - 2022-11-24T12:18:08+05:30

ఏఐసీసీ ఇచ్చిన పదవిని మాజీ ఎంపీ హర్షకుమార్ తిరస్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ఏఐసీసీ (AICC) ఇచ్చిన పదవిని మాజీ ఎంపీ హర్షకుమార్ (Harshakumar) తిరస్కరించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ - మెయిల్ ద్వారా తిరస్కరణ లేఖను పంపించారు. ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా హర్షకుమార్ (Former MP) ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikharjuna Kharge) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని మాజీ ఎంపీ వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారే ఉన్నారని తెలిపారు. వైసీపీ - రెడ్డి, టీడీపీ - కమ్మ, జనసేన - కాపు, బీజేపీ - కాపు, సీపీఎం- రెడ్డి, సీపీఐ - బి.సి, ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవి బ్రాహ్మణ వర్గానికి ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని అగ్రవర్ణాల వారికి ఇస్తే కాంగ్రెస్ బలపడుతుందని హర్షకుమార్ (Congress Leader) పేర్కొన్నారు.

Updated Date - 2022-11-24T12:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising