ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ChandraBabu: సైకో పాలనలో సంక్షేమం పేరిట దోపిడీ జరుగుతోంది

ABN, First Publish Date - 2022-12-09T21:44:40+05:30

Bapatla: టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ (CM Jagan)ను సైకోతో పోల్చారు. ఏపీని సైకో పాలన సాగుతోందని విమర్శించారు. సంక్షేమం పేరిట దోపిడీ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bapatla: టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ (CM Jagan)ను సైకోతో పోల్చారు. ఏపీని సైకో పాలన సాగుతోందని విమర్శించారు. సంక్షేమం పేరిట దోపిడీ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఇసుకను ఉచితంగా ఇస్తే.. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుకను రూ. 6 వేలకు కొనాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇసుక దొరక్క నిర్మాణాలు ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని బాపట్లలో పేర్కొన్నారు. బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్రాభివృద్ధి కోసమే అమరావతిని ప్రారంభించా. అమరావతి బిల్లుకు జగన్ కూడా మద్దతు తెలిపారు. ఇప్పుడు మూడు రాజధానులంటున్నారు. తెలంగాణలోని 7 మండలాలు ఏపీలో కలపాలని పట్టుబడి సాధించా. ఆ మండలాలు కలవకపోతే పోలవరం ప్రాజెక్టు లేదు. పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశా. సైకో ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అని పనులు ఆపేసారు. ప్రతి పంటకు నీళ్లు ఇవ్వాలని పట్టిసీమ ప్రాజెక్టుని రికార్డు సమయంలో పూర్తి చేశా. పోలవరం, అమరావతికి రాష్ట్రానికి రెండు కళ్లు. వైసీపీ వచ్చాక రెండు కళ్లు పొడిచేసారు. ఐదేళ్లలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను. మరో రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది. కానీ కంపెనీలను బెదిరించి తరిమేశారు. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక అమరరాజా పక్క రాష్ట్రానికి తరలి పోయింది. రాష్ట్రంలో అప్పులు పెరిగాయి. మూడేళ్లల్లో రూ 5.50 లక్షల కోట్ల అప్పు చేశారు. సైకో పాలనకు జనమే చరమగీతం పడాలి’’ అని చంద్రబాబు కోరారు.

అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు

టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి ప్రతి మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు, మహిళా సాధికారత గురించి తన ప్రసంగంలో చంద్రబాబు వివరించారు.

Updated Date - 2022-12-09T21:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising