ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anand Babu: పెత్తనమంతా జగన్ వర్గందే

ABN, First Publish Date - 2022-12-01T16:31:17+05:30

రాష్ట్రంలో పదవులన్నీ ముఖ్యమంత్రి సామాజిక వర్గంతో నిండిపోయాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు (TDP senior leader Nakka Anand Babu) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 800 మందిని వివిధ

పెత్తనమంతా జగన్ వర్గందే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో పదవులన్నీ ముఖ్యమంత్రి సామాజిక వర్గంతో నిండిపోయాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు (TDP senior leader Nakka Anand Babu) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 800 మందిని వివిధ పదవుల్లో జగన్ వర్గీయులనే నియమించారని విమర్శించారు. డీఎస్పీ(DSP) పోస్టింగ్‌ల్లో కూడా 40 శాతం మందిని తన వర్గం వారిని నియమించారని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి(Cm jagan), సీఎస్, డీజీపీ, సలహాదారు అంతా ఒకే జిల్లా ఒకే వర్గం వారేనని దుయ్యబట్టారు. పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్‌గా సీనియర్ అయిన బాలు నాయక్‌ని పక్కనపెట్టి ఆయన కన్నా జూనియర్ అయిన తన వర్గానికి చెందిన సుబ్బారెడ్డిని జగన్ నియమించారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని దళితులంతా స్పందించాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జగన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారినే జగన్ దగా చేస్తున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు.

Updated Date - 2022-12-01T16:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising