ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vidadala Rajini: మంత్రి విడదల రజిని పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి.. జగన్ ఇచ్చింది మామూలు వార్నింగ్ కాదుగా..!

ABN, First Publish Date - 2022-12-18T13:03:23+05:30

గడగడపకు ప్రభుత్వం నిర్వహణ, ఎమ్మెల్యేల పనితీరు.. ఈ అంశాలపై ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలతో శుక్రవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. దీనిలో చిలకలూరిపేట శాసనసభ్యురాలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పనితీరుపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తీరు మారకుంటే..మార్పు తప్పదు

మంత్రి విడదల రజిని పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి

వంద రోజులు డెడ్‌లైన్‌

వర్క్‌షాప్‌లో జగన్‌ పరోక్ష హెచ్చరికలు

చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు

ఎంపీ లావు, మర్రి, విడదల ఎవరి దారి వారిదే

నరసరావుపేట: గడగడపకు ప్రభుత్వం (gadapa gadapaku mana prabhutvam) నిర్వహణ, ఎమ్మెల్యేల పనితీరు.. ఈ అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (AP CM Jagan) ఎమ్మెల్యేలతో శుక్రవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. దీనిలో చిలకలూరిపేట శాసనసభ్యురాలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని (AP Health Minister Vidadala Rajini) పనితీరుపై జగన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొక్కుబడిగా నియోజకవర్గంలో మంత్రి గడగడకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అందిన సర్వే నివేదికల అధారంగా సీఎం జగన్‌ రజనిపై (CM Jagan Fires on Vidadala Rajini) అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గతంలో జరిగిన వర్క్‌షాప్‌లో కూడా రజనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోమారు అమె పరితీరుపై అసంతృప్తి వ్యక్తం కావడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

రానున్న వందరోజుల్లో అంటే మార్చిలో మరో సారి నిర్వహించే వర్క్‌షాప్‌ నాటికి పనితీరు మెరుగుపరచుకోవాలని, గడగడపకు ప్రభుత్వం ప్రతి ఇంటికి చేరాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏమాత్రం పనితీరు మెరుగుపడకపోయినా మార్చేయడం తధ్యమని తీవ్రస్థాయిలోనే జగన్‌ హెచ్చరించారన్న ప్రచారం జరుగుతోంది. గడగడపుకు ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం రెండు గంటలైనా సచివాలయంలో ఉండాలని, ప్రతి ఇంటికి వెళ్లి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని, వారు తెలియజేసే సమస్యలను తెలుసుకోవాలని, ఈ కార్యక్రమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించినట్టు ఎమ్మెల్యేలే చెబుతున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీలో (Chilakaluripet YCP) వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Narasaraopet MP Sri Krishnadevaraya), మంత్రి విడదల రజిని (Minister Vidadala Rajini), మాజీ శాసన సభ్యుడు మర్రి రాజశేఖర్‌ (Ex MLA Marri Rajasekhar) ఇలా మూడు వర్గాలు పార్టీలో ఏర్పడ్దాయి. సదరు నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ, మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వారి మధ్య వార్‌ నెలకొంది. మర్రి రాజశేఖర్‌ వద్దకు పార్టీలోని వారు వెళ్ళకూడదన్న విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారని నేతలు చెబుతున్నారు. ఒకవేళ అలా వెళ్లిన నేతలను మంత్రి టార్గెట్‌ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఐప్యాక్‌ టీం (I-PAC Team) నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. మంత్రి రజిని పనితీరుపై నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. అలాగే తాడేపల్లి పార్టీ కార్యాలయానికి నియోజకవర్గంలోని ముఖ్యులను పిలిపించి చర్చించారు. 25మందికి పైగా నేతలతో విడివిడిగా అభిప్రాయాలను సేకరించింది. మంత్రి రజిని అందుబాటులో ఉండటంలేదని, కనీసం కాల్‌ చేసిన మాట్లాడరని, తమతో ఆమె పీఏ మాత్రమే మాట్లాడతారని నేతలు కుండబద్దలు కొట్టి చెప్పుకొచ్చారు. ఈ నివేదిక అధారంగానే వర్క్‌షాప్‌లో రజిని పనితీరుపై జగన్‌ అసంతృ ప్తి వ్యక్తం చేశారంటున్నారు.. వచ్చే వర్క్‌షాపు కల్లా పనితీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. రజిని పనితీరుపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రత్యర్ధి వర్గానికి కలసివచ్చేదిగా ఉంది. రజిని వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేయరని, విశాఖ నుంచి పోటీ చేయొచ్చని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించకపోవడం దీనికి బలం చేకూర్చేదిగా ఉంది.

Updated Date - 2022-12-18T14:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising