Venkaiah Naidu: ఎన్టీఆర్ అందరినీ నమ్మేవారు... అందుకే
ABN, First Publish Date - 2022-12-24T14:06:23+05:30
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో కొత్త ఒరవడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ (NTR) అని కొనియాడారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్ద పీట వేశారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బోళాతనంగా ఉండేవారని తెలిపారు. అందరినీ నమ్మేవారు, అందుకే వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యలు చేశారు. సిద్దాంతాలు వేరైనా పద్ధతులు పాటించే వారంటే తనకు గౌరవమని చెప్పుకొచ్చారు. ఉచితాలు అనుచితం అని... చేపలు పెట్టడం కాదు పట్టడం నేర్పాలని హితవుపలికారు. సమాజంలో అశాంతి పెరుగుతుందని.. మనుషుల్లో అశాంతి పెరిగిందన్నారు. ఎన్టీఆర్ స్పూర్తిని నేటి తరం కొనసాగించాలని కోరారు. ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేశానని... కానీ ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదని వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) పేర్కొన్నారు.
Updated Date - 2022-12-24T14:07:01+05:30 IST