Narsaraopet: గుంటూరు జిల్లా వాళ్లు ఇందుకు సంతోషించాలో.. అందుకు బాధపడాలో..!
ABN, First Publish Date - 2022-11-28T16:36:55+05:30
నరసరావుపేట (Narasaraopet) మార్గంలో శబరిమలకు (Sabarimala) రైల్వేశాఖ ఒక ప్రత్యేక రైలుని (Sabarimala Special Trains) ప్రకటించినందుకు సంతోషించాలో..
గుంటూరు (ఆంధ్రజ్యోతి): నరసరావుపేట (Narsaraopet) మార్గంలో శబరిమలకు (Sabarimala) రైల్వేశాఖ ఒక ప్రత్యేక రైలుని (Sabarimala Special Trains) ప్రకటించినందుకు సంతోషించాలో.. అందులో రిజర్వేషన్‌కు తగినన్ని టిక్కెట్‌లు ఈ ప్రాంతానికి కేటాయించనందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. అయ్యప్ప భక్తులు (Ayyappa Devotees), ఎంపీలు అడగంగా.. అడగంగా తొలిసారి నరసరావుపేట(Narasaraopet), వినుకొండ (Vinukonda) మార్గంలో కేవలం ఒక ప్రత్యేక రైలుని నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అది కూడా గుంటూరు (Guntur) నుంచి ప్రారంభించకుండా నరసాపురం (Narsapuram) నుంచి నడుపుతామని పేర్కొన్నది.
నెంబరు. 07143 నరసాపురం-కొట్టాయం రైలు (Narasapuram to Kottayam Train) డిసెంబరు 22వ తేదీన రాత్రి 9 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.40కి గుంటూరు, 2.30కి నరసరావుపేట, 3.01కి వినుకొండ, 24వ తేదీ వేకువజామున 5.30కి కొట్టాయం చేరుకొంటుంది. అలానే నెం.07144 కొట్టాయం-నరసాపురం రైలు డిసెంబరు 24న ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 25వ తేదీ మధ్యాహ్నం 12.53కి వినుకొండ, 1.23కి నరసరావుపేట, 2.25కి గుంటూరు, రాత్రి 8.30కి నరసాపురం చేరుకొంటుంది. కాగా ఇప్పటివరకు ఈ రైలులో బుకింగ్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పలేదు. ఈ విషయం తెలియక చాలామంది రైల్వే బుకింగ్ కౌంటర్లు, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్/యాప్‌లో టిక్కెట్‌లు రిజర్వు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా వుంటే స్లీపర్‌క్లాస్ టిక్కెట్‌లు నరసాపురం నుంచి గుడివాడ వరకు 376 జనరల్ కోటాలో పెట్టారు.
విజయవాడ (Vijayawada) నుంచి గుంటూరు (Guntur), నరసరావుపేట (Narsaraopet), వినుకొండ (Vinukonda), రేణిగుంట (Renigunta) వరకు రిమోట్ లొకేషన్ పెట్టి కేవలం 159 టిక్కెట్‌లు మాత్రమే కేటాయించారు. ప్రత్యేకించి పల్నాడు (Palnadu), నంద్యాల (Nandyala) ప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ రైలులో ఎక్కువ టిక్కెట్‌లు నరసాపురం నుంచి గుడివాడ (Narasapuram to Gudivada) వరకు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవ్వక... ఇవ్వక ఇచ్చిన ఒక ప్రత్యేక రైలులో రిమోట్ లొకేషన్‌లో కొన్ని టిక్కెట్‌లు మాత్రమే ఇవ్వడం వలన ఈ ప్రాంత ప్రయాణీకులకు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. ఈ నేపథ్యంలో నరసాపురం నుంచి రేణిగుంట వరకు మొత్తం జనరల్ కోటా చేసి బుకింగ్‌కు అనుమతించాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ రైలుని నరసాపురం నుంచి కాకుండా గుంటూరు నుంచి స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరి మొదటివారం, మకర సంక్రాంతి సమయంలోనూ మరో రెండు ట్రిప్పులు నరసరావుపేట మార్గంలో నడపాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-11-28T16:38:51+05:30 IST