JAGAN: కందుకూరు ఘటన బాధిత కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం
ABN, First Publish Date - 2022-12-29T22:11:43+05:30
నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు (Chandrababu) సభలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JAGANMOHAN REDDY) సంతాపం తెలిపారు.
అమరావతి: నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు (Chandrababu) సభలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JAGANMOHAN REDDY) సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు సీఎం జగన్ ఆర్థికసాయం ప్రకటించారు. తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు అందజేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.
బుధవారం రాత్రి కందుకూరులోని ఎన్టీఆర్ (NTR) కూడలిలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోయారు. పోస్టుమార్టం అనంతరం గురువారం ఉదయం ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఘటనలో మృతి చెందిన కందుకూరు (Kandukuru) నియోజకవర్గానికి చెందిన ఏడుగురి నివాసాలకు పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు వెళ్లారు. ముందుగా మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రబాబు ఓదార్చారు.
Updated Date - 2022-12-29T22:20:12+05:30 IST