Janasena Leaders: అంబటి ఎక్కడికి పారిపోయావు.. ఇదిగో నీ లంచాల బాగోతం
ABN, First Publish Date - 2022-12-20T11:08:22+05:30
అంబటి రాంబాబు బాధితుల విషయంపై జనసేన నేతలు బోనబొయిన శ్రీనివాస యాదవ్, గాదె వెంకటేశ్వర రావు స్పందించారు.
గుంటూరు: ఏపీ మంత్రి అంబటి రాంబాబు (AP Minister Ambati Rambabu) బాధితుల విషయంపై జనసేన నేతలు బోనబొయిన శ్రీనివాస యాదవ్, గాదె వెంకటేశ్వర రావు (Janasena Leaders bonaboina Srinivas Yadav, Gade Venkateshwar Rao) స్పందించారు. ‘‘అయ్యా అంబటి ఎక్కడ దాక్కున్నావ్.. ఎక్కడికి పారిపోయావు. లంచం డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా అన్నావు. ఇదిగో నీ లంచాల బాగోతం నిరూపించాం. ఎప్పుడు రాజీనామా చేస్తావో చెప్పు. రేపల్లె నుంచి పారిపోయి వచ్చినట్లు సత్తెనపల్లి నుంచి కూడా పారిపోయావా. తురకా మంగమ్మ దంపతులకు తక్షణమే పరిహారం చెక్కు ఇవ్వాలి. సాయంత్రంలోపు ఇవ్వకపోతే ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తాం.అవసరమైతే జనసేన ఆమరణ నిరహార దీక్ష చేస్తాం. మంగమ్మ దంపతులకు ఏదైన హానీ జరిగితే అంబటి రాంబాబు దే బాధ్యత. మంగమ్మ కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది’’ అంటూ జనసేన నేతలు స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే...
సత్తెనపల్లి ఓ రెస్టారెంట్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా తమ కొడుకు చనిపోయాడని... ఇందుకు గాను ప్రభుత్వం నుంచి ఐదు లక్షల పరిహారం వచ్చిందని బాధితులు తెలిపారు. అయితే ఐదు లక్షల చెక్కు ఇవ్వాలంటే రూ.2.50 లక్షల లంచం ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ భర్త సాంబశివరావులు అడిగారని ఆరోపించారు. తమ కొడుకు మృతితో వచ్చే డబ్బులతో తమ కుమార్తె పెళ్ళి చేసుకుందాం అనుకున్నామని తెలిపారు. అంబటి రాంబాబు లంచం విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించామని... పవన్ వచ్చి వెళ్లిన నాటి నుంచి వైసీపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. తమ కొడుకు మృతి పరిహారం చెక్కు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
Updated Date - 2022-12-20T11:08:23+05:30 IST