ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varla Ramaiah జగన్‌కు నైతిక విలువలుంటే.. ఆ ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాడు

ABN, First Publish Date - 2022-11-26T19:10:11+05:30

Amaravathi: టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu Naidu), ఆయన కుటుంబంపై రాప్తాడు వైసీపీ(YCP) ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందు (చంద్రశేఖర్ రెడ్డి) చేసిన వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య తప్పుబట్టారు. పార్టీ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu Naidu), ఆయన కుటుంబంపై రాప్తాడు వైసీపీ(YCP) ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందు (చంద్రశేఖర్ రెడ్డి) చేసిన వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య తప్పుబట్టారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు కావడం వల్లే వైసీపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీని, నేతల్ని కంట్రోల్ చేయలేని దుస్థితిలో జగన్ ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునుద్దేశించి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ చేసిన విమర్శలను వర్ల రామయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. “చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిచంపాలి. చంద్రబాబుని బంగాళాఖాతంలోకలిపేయాలి. గ్రామాల్లో తిరిగితే చంద్రబాబుని రాళ్లతో కొట్టండి.అని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. అధినాయకుడే బరితెగించి మాట్లాడితే..పార్టీ నేతలు, నాయకులు అశ్లీలత, అసభ్యతతో మాట్లాడటంలో వింతేముంది?’’ అని పేర్కొన్నారు. జగన్‌కు ఏమాత్రం నైతిక విలువలున్నా.. ఎమ్మెల్యేని, అతని సోదరుడిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే టీడీపీ నేతలపై కేసులు పెట్టే పోలీసులు.. తోపుదుర్తి చందు విషయంతో ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారని ప్రశ్నించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణమే ఎమ్మెల్యే సోదరుడిపై సుమోటోగా కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-26T19:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising