AP Highcourt: ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా
ABN, First Publish Date - 2022-11-24T12:55:59+05:30
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు హైకోర్టు జరిమానా విధించింది.
అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు హైకోర్టు (AP Highcourt) జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో విచారణ సందర్భంగా తమకు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము నోటీసులు ఇచ్చిన తరువాతనే కూల్చేశామని ఇటీవల విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులను ఈ రోజు హైకోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇప్పటం గ్రామస్తులు ఈరోజుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే తమకు అవగాహన లేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ వారి వాదనను తిరస్కరించిన హైకోర్ట్... ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించింది.
Updated Date - 2022-11-24T12:56:00+05:30 IST