AP Minister: కైకాల సత్యనారాయణ మరణం బాధాకరం
ABN, First Publish Date - 2022-12-23T11:39:23+05:30
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.
న్యూఢిల్లీ: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Senior Actor Kaikala Satyanarayana) మృతిపట్ల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (AP Minister Karumur Nageshwar Rao) సంతాపం తెలిపారు. కైకాల సత్యనారాయణ మరణం బాధాకరమన్నారు. నవరసాలు పండించే మహా నటుడు లేకపోవడం తీరని లోటని ఆవేదన చెందారు. ఎవరితోను విభేదాలు లేకుండా సినీ రంగంలో దిగ్గజంగా ఎదిగారని... అందరిలో ఒకరిగా కైకాల మెలిగారన్నారు. కైకాల కుటుంబీకులకు మంత్రి సంతాపాన్ని తెలియజేశారు. ‘‘హైదరాబాద్లో కైకాల నివాసం పక్కనే నా నివాసం. కైకాల నాతో సన్నిహితంగా ఉండేవారు. అన్ని అంశాలు పంచుకునే వారు.. రాష్ట్రం తెలుగు ప్రజలు బావుండాలని కోరుకునే వ్యక్తి కైకాల’’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.
Updated Date - 2022-12-23T11:39:24+05:30 IST