Minister Peddireddy: ప్రజలను ఆకర్షించే జంతువులను తీసుకువస్తాం
ABN, First Publish Date - 2022-12-14T13:51:06+05:30
ఏపీ అటవీశాఖపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
అమరావతి: ఏపీ అటవీశాఖపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) బుధవారం సమీక్ష నిర్వహించారు. తిరుపతి, విశాఖ జూపార్క్ల అభివృద్ధిపై ప్రధానంగా చర్చ నిర్వహించారు. ప్రజలను ఆకర్షించే జంతువులను తీసుకువస్తామని మంత్రిఅన్నారు. దేశంలోని ఇతర జూపార్క్‌లతో జంతువుల ఎక్స్చేంజ్ చేయాలని ఆదేశించారు. కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు మెమో ట్రైన్ ఏర్పాటు చేయాలని... తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా రైతులకు మేలుజాతి మొక్కలు అందించాలని తెలిపారు. అటవీశాఖ పరిశోధన కేంద్రాలను బలోపేతం చేస్తామన్నారు. బయోడైవర్సిటీ బోర్డ్ ద్వారా అరుదైన జీవ, జంతుజాలాన్ని పరిరక్షిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
Updated Date - 2022-12-14T16:26:44+05:30 IST