AP News: రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టండి..జగన్‌కు రామకృష్ణ లేఖ
ABN, First Publish Date - 2022-11-30T09:19:10+05:30
వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganamohan reddy)కి రామకృష్ణ (Ramakrishna lettet to cm Jagan) లేఖ రాశారు. గత మూడున్నరేళ్లలో రాయలసీమ ప్రాంతానికి మీరేం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్ట హామీ ప్రకారం రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ నిధులను కేంద్రం నుంచి రాబట్టాలన్నారు. సీమలోని నాలుగు జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టును రెండింతలు చేస్తానన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు.
ప్రాజెక్టుల కింద కనీసం కాలువలు కూడా తవ్వకుండా సాగునీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం గురించి అతీగతీ లేదని విమర్శించారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని ఒకపక్క చెబుతూనే, మరోపక్క సుప్రీంకోర్టులో హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయటం ద్వంద వైఖరి కాదా అంటూ మండిపడ్డారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతానికి సంబంధం లేని విశాఖలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు తగునా అని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2022-11-30T09:19:11+05:30 IST