Devineni Uma: జగన్ గురించి ఆనాడే చంద్రబాబు చెప్పారు
ABN, First Publish Date - 2022-12-14T21:41:30+05:30
ఏపీలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శించారు. వైసీపీ నేతలు అధికార దుర్వినియోగం చేశారని, రుషికొండను బోడిగుండు చేసి సీఎం కార్యాలయం అంటున్నారని మండిపడ్డారు. పబ్జి ఆడుకుంటూ జగన్ (Jagan) రెడ్డి పాలన చేస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు. పింఛన్ రూ.3 వేలు చేస్తానన్న జగన్.. నాలుగేళ్లలో పెంచలేదని, విదేశీ విద్య దూరం చేశారని, పెళ్ళి కానుక ఏమైందో తెలియదని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగకు కానుకలు ఎమయ్యాయో తెలియదని, పిచ్చోడి చేతిలో రాయి ఎవరి మీద విసురుతాడో తెలియదని ఉమ విమర్శించారు. కర్నాటక, తెలంగాణ ఎన్నికలు ఉన్నాయని, ఎప్పుడూ ఎన్నికలకు వెళతాడో తెలియదని, ఓటరు లిస్టులను అపహాస్యం చేశారని మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. జగన్ వస్తే అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు చెప్పారని, పోలవరం, అమరావతి ఆగిపోతాయని ఆనాడే చెప్పారని దేవినేని ఉమ గుర్తు చేశారు. చంద్రబాబు మాటలను ఆనాడు అవహేళన చేశారని.. కానీ, అదే నిజమైందని ఉమ అన్నారు.
Updated Date - 2022-12-14T21:45:24+05:30 IST