Kollu ravindra: మూడేళ్లుగా బందరు పోర్టు ప్రకటనలకే పరిమితం
ABN, First Publish Date - 2022-11-08T14:05:10+05:30
మూడేళ్లుగా బందరు పోర్టు ప్రకటనలకే పరిమితమైందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
అమరావతి: మూడేళ్లుగా బందరు పోర్టు ప్రకటనలకే పరిమితమైందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu ravindra) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం మొత్తం మెగా రెడ్డి చేతుల్లోనే పెట్టారని... బందరు పోర్టు కూడా మెగా రెడ్డి చేతుల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బందరు పోర్టు గురించి కనీసం సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. జగన్ సర్కార్... ఆస్పత్రుల్లో కనీస ఏర్పాట్లు చేయడం లేదని మండిపడ్డారు. మృతదేహాలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేయలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వమని కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.
Updated Date - 2022-11-08T14:05:11+05:30 IST