Kollu Ravindra: రొయ్య రైతుల జొలికి వస్తే పుట్టగతులుండవు
ABN, First Publish Date - 2022-11-17T11:56:49+05:30
జె ట్యాక్స్ కోసం ఆక్వా రంగాన్ని అస్థిరపరిచారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.
అమరావతి: జె ట్యాక్స్ కోసం ఆక్వా రంగాన్ని (Aqua sector) అస్థిరపరిచారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఆక్వా రంగాన్ని దెబ్బతీసేందుకు మంత్రులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రొయ్య రైతుల జొలికి వస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. వైసీపీకి అధికారమిస్తే ఆక్వా రైతులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ఆక్వా రంగంపై ఎప్పుడూ, ఎటువంటి నిబంధనలు ఏ ప్రభుత్వాలు విధించలేదని తెలిపారు. కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితులున్నాయన్నారు. అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి పంట పండిస్తే వేధింపులా? అని ప్రశ్నించారు. ఆక్వా రైతులను నేరస్థులను చూసినట్లు చూస్తున్నారన్నారు. ఆక్వా రైతులపై రెవెన్యూ అధికారులు వేధిందపులు అధికమయ్యాయని తెలిపారు. రాష్ట్రాన్ని నమ్మి ఒక్క పరిశ్రమ రాలేదని కొల్లు రవీంద్ర (Former minister) పేర్కొన్నారు.
Updated Date - 2022-11-17T11:56:51+05:30 IST