ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra: మత్య్సకారులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది

ABN, First Publish Date - 2022-11-21T12:26:56+05:30

ప్రపంచ మత్య్సకార దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రపంచ మత్య్సకార దినోత్సవం (World Fisheries Day) సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు చీర, సారె సమర్పించి తమను ఆదుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర (Former Minister) మాట్లాడుతూ... గడిచిన మూడున్నరేళ్లుగా మత్య్సకారులకు వైసీపీ ప్రభుత్వం (YCP Government) తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 217 జీఓ తీసుకొచ్చి మత్య్సకారుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు ... ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదని ఆయన విమర్శించారు.

ఆక్వా రంగాన్ని (Aqua Sector) వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కుదేలు చేసిందన్నారు. నాసి రకం ఫీడు సరఫరాతో ఆక్వా దిగుబడి గమనీయంగా తగ్గిపోతోందని తెలిపారు. జే ట్యాక్స్ ఆక్వా రంగంపై విధించడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఏ-1 కౌంట్ ఉన్న రొయ్యలు ఖచ్చితంగా రూ.250లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలిడేకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారన్నారు. త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా మత్య్సకారులతో కలిసి పోరాటం చేస్తామని కొల్లు రవీంద్ర (TDP Leader) స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-21T12:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising