ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venugopalakrishna: జగన్‌‌ను.. శ్రీకృష్ణుడితో పోల్చిన మంత్రి

ABN, First Publish Date - 2022-12-01T15:42:07+05:30

సీఎం జగన్.. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ కొనియాడారు. డిసెంబర్ 7న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన

జగన్‌‌ను.. శ్రీకృష్ణుడితో పోల్చిన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీఎం జగన్...(Cm jagan) బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ (chelluboyina srinivasa venugopalakrishna) కొనియాడారు. డిసెంబర్ 7న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ‘‘జయహో బీసీ’’ సభ పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స, జోగి రమేష్, వేణుగోపాల కృష్ణ విడుదల చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్‌ను శ్రీకృష్ణుడితో మంత్రి వేణుగోపాల కృష్ణ పోల్చారు.

విజయసాయిరెడ్డి కామెంట్స్..

‘‘జయహో బీసీ’’ సభకు 84 వేల మంది వస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు. వార్డు మెంబర్ మొదలుకొని పార్టీలో, ప్రభుత్వంలో పదవులు పొందినవారిని ఆహ్వానించినట్లు వెల్లడించారు. డిసెంబర్ 7న ఉదయం 8గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ బీసీల సమస్యలపై వక్తలు మాట్లాడతారని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్(Cm jagan) సభాప్రాంగణానికి వచ్చి గంట పాటు మాట్లాడతారని పేర్కొన్నారు. బీసీలకు ఏం చేశామో.. ఏం చేస్తామో సీఎం చెబుతారని తెలిపారు. ఈ సమావేశానికి అందరూ బీసీ నేతలు వస్తారని ప్రకటించారు. నాన్ బీసీగా ముఖ్యమంత్రి జగన్ మాత్రమే హాజరవుతారని చెప్పారు. సభకు వచ్చే వారందరీ ప్రయాణ ఖర్చులు, భోజన ఏర్పాట్లు పార్టీనే చూసుకుంటుందని వెల్లడించారు. అలాగే త్వరలో జోనల్ మీటింగ్‌లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-01T15:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising