KA Paul: కొడుకు, మనవడికి ఇలా జరిగితే చంద్రబాబు సభలు పెడతారా?
ABN, First Publish Date - 2022-12-30T13:55:02+05:30
కందుకూరులో జరిగిన తొక్కిసిలాటలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ఫిర్యాదు చేయటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం డీజీపీ ఆఫీసుకు వచ్చారు.
అమరావతి: కందుకూరులో జరిగిన తొక్కిసిలాటలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ఫిర్యాదు చేయటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prajashanti Party President KA Paul ) శుక్రవారం డీజీపీ ఆఫీసుకు వచ్చారు. అయితే వాహనానికి లోపలికి అనుమతి లేకపోవటంతో అందులోనే కూర్చుని కేఏ పాల్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విచారణ పూర్తి అయ్యేంత వరకు చంద్రబాబు రోడ్ షోలు, సభలకు పర్మిషన్ క్యాన్సిల్ చేయాలంటూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 5000 నుంచి 10000 పట్టే రోడ్లలో యాభై వేల మందిని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. బిర్యానీ, మందు, డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి చంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మనవడుకు నలుగురు గన్‌మెన్లు ఎందుకని నిలదీశారు. తన కొడుకు, మనవడుకు ఇలాగే జరిగితే చంద్రబాబు సభలు పెడతారా అని కేఏ పాల్ ప్రశ్నించారు.
Updated Date - 2022-12-30T13:55:03+05:30 IST