ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPM: బైజూస్‌ను కాపాడేందుకే ట్యాబ్‌ల కాంట్రాక్ట్

ABN, First Publish Date - 2022-12-21T14:13:12+05:30

మోడీ (pm modi), జగన్(Cm jagan) చేసే మోసాలను ప్రజలు కూడా గమనించాలని సీపీఎం నేత శ్రీనివాసరావు (CPM leader Srinivasa Rao కోరారు. ఆయన మీడియాతో

బైజూస్‌ను కాపాడేందుకే ట్యాబ్‌ల కాంట్రాక్ట్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మోడీ (pm modi), జగన్(Cm jagan) చేసే మోసాలను ప్రజలు కూడా గమనించాలని సీపీఎం నేత శ్రీనివాసరావు (CPM leader Srinivasa Rao కోరారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పాటు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయని తెలిపారు. ‘‘విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ అని వైసీపీ గొప్పగా చెప్పుకుంటుంది. దివాళా అంచున ఉన్న బైజూస్‌(Byjus)ను కాపాడేందుకు ట్యాబ్‌ల కాంట్రాక్టు ఇచ్చారు. బైజూస్ మంచి కంపెనీ అని విద్యావేత్తలు నిర్ధారించారా? వ్యాపార లావాదేవీలతో ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది. ఆస్తి ప్రభుత్వానిదా... పెత్తనం మాత్రం బైజూస్‌దా?‌ ఇదెక్కడి న్యాయం. ఏ సూత్రాల ప్రకారం ఈ ఒప్పందం చేశారో ప్రజలకు చెప్పాలి. తక్కువ ధరకు వచ్చిందని చెప్పడం ప్రజలను దగా చేయడమే. అమ్మ ఒడి(Amma odi) పథకానికి ముందు డబ్బులు వేయాలి. పోలవరం(Polavaram) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు దారుణంగా ఉంది. వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఎటువంటి న్యాయం చేశారు. ముంపు బాధితులకు పూర్తిగా సహకారం అందించాలి. పోలవరం నిర్వాసితులకు ఆర్.ఆర్ ప్యాకేజీ ఇచ్చి పనులు చేసేలా చూడాలి. కేంద్రం.. ఏపీకి అన్యాయం చేస్తున్నా... ‌కనీసం అడగలేని దుస్థితి లో జగన్ ఉన్నారు.’’ అని ధ్వజమెత్తారు.

‘‘రాష్ట్రంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్న వైనంపై సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించాం. కేంద్రం లేబర్ యాక్ట్ తెచ్చి కార్మిక హక్కులు కాల రాసింది. వ్యతిరేకత వ్యక్తం చేయాల్సిన జగన్ ప్రభుత్వం మోడీకి మద్దతు ఇవ్వడం దుర్మార్గం. బీజేపీ పాలించే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాలకు మద్దతు ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులపై దమనకాండ సాగిస్తుంది.’’ అని శ్రీనివాసరావు మండిపడ్డారు.

Updated Date - 2022-12-21T14:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising