ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anagani satyaprasad: నూతన కల్లుగీత పాలసీతో గీత కార్మికులకు ఒరిగేది శూన్యం

ABN, First Publish Date - 2022-11-01T10:40:21+05:30

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కల్లుగీత పాలసీతో గీత కార్మికులకు ఒరిగేది శూన్యమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కల్లుగీత పాలసీతో గీత కార్మికులకు ఒరిగేది శూన్యమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Anagani satyaprasad విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... తాటిచెట్టుకు, ఈతచెట్టుకు తేడా తెలియనివారు పాలసీ రూపొందించినట్లున్నారని యెద్దేవా చేశారు. తిరుపతి కొండ కాలినడకన ఎక్కలేని సీఎం (YS Jagan mohan reddy)కు తాటిచెట్టు ఎక్కే గీత కార్మికుల బాధలేం తెలుస్తాయని అన్నారు. జగన్ రెడ్డి (AP CM).. తన జే బ్రాండ్ మద్యాన్ని విక్రయించుకునేందుకు లక్షలాది మంది కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. 2 లక్షల మందికి పైగా గీత కార్మికులు వృత్తిపై ఉంటే 95వేల మంది మాత్రమే ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

గీత కార్మికులకన్నా మద్యం అమ్మకాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యమన్న విషయం పాలసీతో స్పష్టమైందని తెలిపారు. కల్లుగీత సంఘాలు కార్మికులతో చర్చించకుండా పాలసీని ఏకపక్షంగా ఏ విధంగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. బీమా పథకాన్ని గీత కార్మికులకు టీడీపీ ఎప్పటి నుంచో అమలు చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. మూడున్నరేళ్లలో 47 మంది గీత కార్మికులు మరణిస్తే ప్రభుత్వం 10 శాతం మందికి కూడా సాయం చేయని విషయం నిజంకాదా? అంటూ నిలదీశారు. ఈ పాలసీని వెంటనే రద్దు చేసి గీత కార్మికులకు ప్రయోజనం కలిగేలా నూతన పాలసీని ప్రకటించాలని అనగాని సత్యప్రసాద్ (TDP MLA) డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-01T10:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising