ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayesha Meera caseను ఆనంద్, ప్రస్తుత డీజీపీ తప్పుదోవ పట్టించారు

ABN, First Publish Date - 2022-12-27T13:57:12+05:30

అయేషామీరా హత్య కేసు (Ayesha Meera case)ను ఐపీఎస్‌ అధికారులు ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) తప్పు దోవ పట్టించారని

ప్రస్తుత డీజీపీ తప్పుదోవ పట్టించారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అయేషామీరా హత్య కేసు (Ayesha Meera case)ను ఐపీఎస్‌ అధికారులు ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) తప్పు దోవ పట్టించారని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆరోపించారు. అయేషామీరా హత్య చేయబడి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె తల్లి మీడియాతో మాట్లాడారు. అయేషామీరాను హత్య చేసిన నిజమైన హంతకులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘ఈ కేసులో సత్యంబాబు(Satyambabu)ను అరెస్ట్ చేసినా కోర్టులో దోషిగా నిర్ధారించలేదు. 2018 డిసెంబరులో కేసు సీబీఐ(CBI) స్వీకరించింది. తమను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్‌ఏ టెస్ట్(DNA test) కూడా చేయించారు. మా దగ్గర ఉన్న అన్ని వివరాలు సీబీఐకి ఇచ్చాం. మత పెద్దలు ఆనాడు రీ పోస్ట్‌మార్టంకు అంగీకరించ లేదు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్‌మార్టం(Postmortem) చేశారు. మూడేళ్లుగా పాప శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదు. ఈ కేసును బై ఫర్ కేషన్ చేశామని అధికారులు అంటున్నారు. సీబీఐ కూడా అవినీతి మయం అయిపోయింది. అందుకే మేము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. అసలైన దోషులకు శిక్ష పడి.. న్యాయం జరిగే వరకూ ముందుకు సాగుతాం. వైఎస్(YS Rajasekhar Reddy) సీఎంగా ఉన్న సమయంలో అయేషా హత్య జరిగింది. జగన్మోహన్ రెడ్డి(Cm jagan) ఇప్పుడు నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలి. నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం సహకారం అందించాలి.’’ అని ఆమె డిమాండ్ చేశారు.

గంగాభవాని..

అయేషా హత్యపై న్యాయ పోరాట సమితి పేరుతో పోరాటం చేస్తున్నట్లు గంగాభవాని తెలిపారు. 2007లో చనిపోయిన నాటి నుంచి 2019వరకు అనేక శాఖల అధికారులు దర్యాప్తు చేశారు. సీబీఐ విచారణ చేసినా దోషులు పట్టుకోలేక పోయారు. వారు ఎవరి ఒత్తిడులకు లొంగారో తేల్చాలి. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి‌ కూడా సాయం అందించలేదు. మోడీ, జగన్ ప్రభుత్వాలపై మాకు నమ్మకం లేదు. అందుకే సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని నిర్ణయించాం. ప్రజా సంఘాలు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.’’ అని గంగాభవాని స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-27T13:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising