Karthika Masam మొదటి సోమవారం.. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2022-10-31T09:39:54+05:30
శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.
నంద్యాల: శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. గంగాధర మండపం శీవాజి గోపురం మాడవీధులలో కార్తీకదీపాలను వెలిగిస్తూ మహిళా ముత్తైదువలు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయింది. స్వామివారి దర్శనానికి 6 గంటలు సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు రద్దు సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్న భక్తులకు కూడ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. పాతాళగంగ గంగలో భక్తులు పుణ్య స్నానాలచరిస్తున్నారు. శ్రీశైలం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
Updated Date - 2022-10-31T09:39:56+05:30 IST