ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: ఓట్లు కొనేందుకే జగన్ అక్రమ సంపాదన.. ఓటుకు రూ.10 వేలు

ABN, First Publish Date - 2022-12-29T21:10:53+05:30

కావలిలో టీడీపీ నిర్వహించిన రోడ్‌ షో లో టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababunaidu) పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: కావలిలో టీడీపీ (TDP) నిర్వహించిన రోడ్‌ షోలో పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababunaidu) పాల్గొన్నారు. కందుకూరు మృతులకు నివాళులు అర్పించారు. కందుకూరు మృతుల ఆత్మశాంతి కోసం చంద్రబాబు 2 నిమిషాల మౌనం పాటించారు. ప్రభుత్వంపై పోరాటంలో ముందుకు పోవాలంటూ ప్రజలు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.. వాస్తవమా కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కందుకూరు ఘటన జరగకుండా ఉండాల్సిందని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబంలోని పిల్లలను చదివిస్తానని, స్థానిక ఎమ్మెల్యే రౌడీయిజం తోక కట్ చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, తమ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. వైసీపీ (YCP) నేతలు సైకో దగ్గర పని చేస్తున్నారని, సైకో చెప్పాడని పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.

కేసులు పెట్టి పోలీసులు అమాయకులను వేధిస్తున్నారని, ఎవరినైనా చట్టప్రకారం శిక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు. మేం అడ్డుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా?, అధికారం, పోలీసుల సపోర్ట్‌కు జగన్ దూరమవుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనన్ని మద్యం బ్రాండ్లు ఏపీలోదొరుకుతున్నాయని, జేబ్రాండ్‌తో నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని చంద్రబాబు విమర్శించారు. దేశంలోని అందరు సీఎంల మద్యం ఆదాయం 307 కోట్లు ఉంటుందని, ఒక్క జగన్‌ (JAGAN) ఆదాయం రూ.377 కోట్లు ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఓట్లు కొనేందుకే జగన్ అక్రమ సంపాదన చేస్తున్నారని, ఓటుకు రూ.10 వేలు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

Updated Date - 2022-12-29T21:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising