ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anam Ramanarayana Reddy: ఏమని ఓట్లు అడగాలి?... జగన్‌ సర్కార్‌పై ఆనం ఆగ్రహం

ABN, First Publish Date - 2022-12-28T15:20:22+05:30

ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఏపీ ప్రభుత్వ (AP Government) తీరుపై మరోసారి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (MLA Anam Ramnarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాపూరులో వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్ల సమావేశంలో ఆనం పాల్గొని ప్రసంగించారు. రోడ్లు గుంతలు పూడ్చలేకపోతున్నామని.. తాగడానికి నీళ్లు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద నిధులు ఇస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని అడగాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు ఏమైనా కట్టామా? పనైనా మొదలుపెట్టామా? శంకుస్థాపన ఏమన్నా చేసామా? ఏమని ఓట్లు అడగాలని అన్నారు. పెన్షన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా? గత ప్రభుత్వమూ పెన్షన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ‘‘ఇల్లు కడతానన్నావ్... లే అవుట్లు వేశాం. ఇల్లుల్లేమైనా కట్టామా?’’ అంటూ జగన్ సర్కార్‌పై ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-12-28T15:32:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising