Pattipati Pullarao: ఏపీలో పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి
ABN, First Publish Date - 2022-10-29T17:57:12+05:30
ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల రాజకీయానికి ప్రధానే చెక్ చెప్పాలని ప్రజలు భావిస్తున్నారని, కేంద్రం జోక్యం చేసుకుంటే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Amaravathi: ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై ప్రధాని మోదీ (PM Modi) జోక్యం చేసుకోవాలని టీడీపీ (TDP) నేత పత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల రాజకీయానికి ప్రధానే చెక్ చెప్పాలని ప్రజలు భావిస్తున్నారని, కేంద్రం జోక్యం చేసుకుంటే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో జరుగుతోన్న పరిణామాలను బీజేపీ(BJP) రాష్ట్ర శాఖ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైందన్నారు. మూడు రాజధానుల పేరిట వైసీపీ మంత్రులు ఆడుతున్నది ఓ డ్రామా అని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు గుర్తించారని, వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన, రాయలసీమ ఆత్మగౌరవ సభకు జనాదరణ లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.
Updated Date - 2022-10-29T20:10:56+05:30 IST