Kandukur: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి
ABN, First Publish Date - 2022-12-28T20:30:58+05:30
కందుకూరులో చంద్రబాబు (Chandrababu) పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
నెల్లూరు: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కందుకూరు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాటలో గుండంకట్ట ఔట్‌లెట్‌లో కార్యకర్తలు జారిపడిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతులు: దేవినేని రవీంద్ర(ఆత్మకూరు), యటగిరి విజయ(ఉలవపాడు), కలవకురి యానాది(కొండముడుసుపాలెం), కాకుమాను రాజా(కందుకూరు), మర్లపాటి చిన కొండయ్య(అమ్మవారిపాలెం), పురుషోత్తం(కందుకూరు), రామయ్య(గుళ్లపాలెం)గా గుర్తించారు.
కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసి చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-12-28T23:19:43+05:30 IST