ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP Supremo Jagan: ‘ఇలా అయితే ఎలా ? ఉండేదెవరో అప్పుడు తేలుద్ది’.. జగన్ సీరియస్ వార్నింగ్..

ABN, First Publish Date - 2022-12-18T14:08:50+05:30

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యధికమంది పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల పనితీరుపై సీఎం జగన్మోహనరెడ్డి పెదవి విరిచారు. ఆ విషయాన్ని రాష్ట్రస్థాయి అంశంగా మాట్లాడుతూనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏప్రిల్‌ కల్లా మీ చిట్టా విప్పుతా!

ఉండేదెవరో అప్పుడు తేలుద్ది

ఎమ్మెల్యేలను హెచ్చరించిన జగన్‌

గడపగడపలో వెనుకబడ్డ మంత్రి, మరో నలుగురు ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన రావి

తిరిగిన రోజులు తగ్గిస్తున్నారంటూ ఎమ్మెల్యేల ఆవేదన

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యధికమంది పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల పనితీరుపై సీఎం జగన్మోహనరెడ్డి పెదవి విరిచారు. ఆ విషయాన్ని రాష్ట్రస్థాయి అంశంగా మాట్లాడుతూనే మీ జాతకాలు ఈ నివేదికల్లో ఉన్నాయి చూసుకోండంటూ చెప్పకనే చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని అత్యధికులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముందు వరుసలో లేకపోవటాన్ని ఎత్తిచూపారు కూడా. శుక్రవారం తాడేపల్లిలో జరిగిన వర్క్‌షాప్‌లో ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిన జగన్‌ ఆపై వచ్చే ఏప్రిల్‌ నాటికి మీ జాతక చక్రం చిట్టా విప్పుతానంటూ తీవ్రమైన హెచ్చరికలు కూడా చేయటం విశేషం.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్ష కోసం నెలనెలా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ చార్జ్‌లతో నిర్వహించే సమీక్షా సమావేశాన్ని 76 రోజుల తర్వాత శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించారు. ఎప్పటిలాగే మరొకరికి అవకాశం ఇవ్వ కుండా ఆరంభం నుంచి చివర వరకు మాట్లాడే సీఎం జగన్‌ ఈసారి కూడా అలానే చేశారు. తొ లుత ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు వచ్చే ఏప్రిల్‌ నాటికి మీ జాతకచక్రంపై ప్రత్యేక నివేదికలు తె ప్పిస్తానని స్పష్టం చేశారు. మీ పనితీరు, లోపాలు, ప్రజల్లో, కేడర్‌లో మీకున్న బలాలేంటో తేట తెల్లమవుతాయి.. తదనుగుణంగా బరిలో ఉండేదె వరో పోయేదెవరో అప్పుడే తేల్చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఆయన గడపగడపకులో ముందు ఎవరు ఉన్నారు, వెనకెవరు ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావించారు. గడచిన 76 రోజు ల్లో 20 రోజులు కూడా కార్యక్రమం నిర్వహించని జాబితాలో మంత్రి సురేష్‌తో పాటు ఒంగోలు, దర్శి, కనిగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మీరు కనీసం 20రోజులు కూడా తిరగలేదు. ఇలాగైతే ఇబ్బందిపడతారని హెచ్చ రించారు. ఎక్కువ రోజులు పాల్గొన్న వారి పేర్లు నూ ప్రకటించారు. అందులో రాష్ట్రంలోనే 2వ స్థానంలో పర్చూరు ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు నిలిచారు. బాగా తిరుగుతున్న వారిని అభినందిస్తూనే, తిరగని వారు రానున్న మూడు నాలుగు నెలల్లో పద్ధతి మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో మీరే నష్టపోతారు, మళ్లీ అసెంబ్లీలో కి అడుగుపెట్టలేరని సూటిగా చెప్పారు.

రామనాథంబాబు ఒక్కరే..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం బాగా నిర్వహించిన తొలి 20 మందిలో ఒక్క పర్చూరు ఇన్‌చార్జ్‌ రామనాథం బాబు మినహా మరెవ్వరూ లేకపోవటం మంత్రితో సహా ఐదుగురు ఎమ్మెల్యేలు 20 రోజులు కూడా తిరగకపోవటంతో సహా ఇతరత్రా తన చేతిలో ఉన్న సమాచారం దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లను సూటిగానే హెచ్చరించినట్లు చెప్తున్నారు. దీనికితోడు గడపగడపకు కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లాల్సిందేనన్న అంశాన్ని ప్రస్తావించి మీకు ఓటు వేయడని తెలిసినా, ప్రత్యర్థి నాయకుడైనా వారి ఇంటికి కూడా వెళ్లి మనం చేస్తున్న సంక్షేమ ఫలాలను వివరించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆ కారణంతో కొందరి ఇళ్లను వదిలేస్తే ఆ మేరకు కార్యక్రమ నిర్వహణలో వెనుకబడినట్లు అవుతారని కూడా చెప్పారు.

ఇలా అయితే ఎలా ?

ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల్లో కొందరు అధికారులు పూర్తయిన జాబితా నుంచి కొన్ని సచివాలయాలను తొలగించటం తాము కార్యక్రమం నిర్వహించిన అన్ని రోజులను పరిగణనలోకి తీసుకోక పోవటంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన పనులు మంజూరు చేయకుండా అధికారులు ఇచ్చిన కొన్ని పనులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పటంపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు మధనపడుతున్నారు. అంతేగాక తెలిసి తెలిసి గ్రామాల్లో విపక్ష టీడీపీకి చెందిన ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్తే గ్రామాల్లోని పార్టీ నాయకులు ఎలా అంగీకరిస్తారని ఆ విషయంలో అధినేత నిర్ణయం సరైంది కాదని చర్చించుకోవటం వినిపిస్తోంది. తాము సూచించిన పనులు కాకుండా అధికారులు ఇచ్చిన జాబితాలోని పనులను మంజూరు చేస్తామని సీఎం చెప్పటం కూడా సరైన నిర్ణయం కాదంటూ ఎమ్మె ల్యేలు మధనపడుతున్నారు.

Updated Date - 2022-12-18T14:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising