YS Jaganతో భేటీ తర్వాత RGV వరుస ట్వీట్స్.. అరాచకం మొదలైంది
ABN, First Publish Date - 2022-10-27T15:37:28+05:30
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బుధవారం ఏపీ సీఎం జగన్‌తో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయినట్లుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ భేటీపై..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. బుధవారం ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)తో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయినట్లుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ భేటీపై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఫైనల్‌గా మాత్రం జగన్‌కి అనుకూలంగా వర్మ ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నాడని, అందు నిమిత్తమే ఆయనతో భేటీ అనేలా విషయం బయటికి వచ్చింది. ఈ విషయంపై తాజాగా వర్మ కూడా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘అతి త్వరలో ‘వ్యూహం’ (Vyuham) అనే రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్ (Biopic) కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్’’ అంటూ వరుస ట్వీట్స్‌తో నిన్న భేటీకి సంబంధించిన వివరాలను వర్మ బయటపెట్టాడు. వర్మ చేసిన ఈ ట్వీట్స్ చూసిన వారంతా.. అరాచకం మొదలైంది అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
రామ్ గోపాల్ వర్మ చేసిన వరుస ట్వీట్స్ ఇవే:
(RGV Tweets)నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కథ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం”, 2nd పార్ట్ “శపథం” ... రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం“లో తగులుతుంది .
‘‘వ్యూహం“ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.
Updated Date - 2022-10-27T15:54:50+05:30 IST