Manohar సీఎం వ్యాఖ్యలపై మండిపాటు
ABN, First Publish Date - 2022-11-22T16:29:26+05:30
జనసేన(Janasena)ను రౌడీసేన అన్న సీఎం జగన్(Cm jagan) వ్యాఖ్యలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మండిపడ్డారు. అన్యాయాలను
విశాఖ: జనసేన(Janasena)ను రౌడీసేన అన్న సీఎం జగన్(Cm jagan) వ్యాఖ్యలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మండిపడ్డారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే రౌడీ సేన అంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనసేనకు కాండక్ట్ సర్టిఫికెట్ సీఎం దగ్గర తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు వైసీపీ(ycp government)పై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ తన స్థాయి తగ్గించుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎంలో రెండు ముఖాలు ఉన్నాయి.. బయటకు కనిపించేది ఒక్కటైతే.... తెర వెనుక మరొకటి ఉంది. ప్రభుత్వ యంత్రంగాన్ని దుర్వినియోగం చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరదాలు లేకుండా సొంత నియోజకవర్గంలో కూడా సీఎం తిరగలేకపోతున్నారు. సీఎం సభలో మహిళ చున్నీలు తీయించడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. నల్ల చున్నీలు వేసుకున్న వాళ్ళను పోలీసులు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాం.. వారం పాటు సమీక్షిస్తాం. ప్రణాళికబద్ధంగా పటిష్టత కోసం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచనలు చేశారు. ఉత్తరాంధ్రలో భూదందాలపై జనసేన నేతలు బాగా పోరాటం చేస్తున్నారు. ప్రధానిని పవన్ కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఏపీకి మోదీ అండగా ఉంటారని భావిస్తున్నాం.’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Updated Date - 2022-11-22T16:29:27+05:30 IST