విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు పరిస్థితి విషమం
ABN , First Publish Date - 2022-12-31T01:46:02+05:30 IST
విశాఖ డెయిర్ చైర్మన్ ఆడారి తులసీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
విశాఖ డెయిర్ చైర్మన్ ఆడారి తులసీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యం ఇటీవల బాగా లేకపోవడంతో ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. అక్కడ కిమ్స్ ఆస్పత్రిలో పది రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. విశాఖలో కంటే అక్కడ పరిస్థితి కొంత మెరుగైందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండు రోజుల నుంచి మళ్లీ తిరగబెట్టింది. ప్రస్తుతం వెంటీలేటర్‌పై వుంచి చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగానే వుందని సమీప బంధు వర్గాలు తెలిపాయి.