ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీడీపీలో చేరికలు... ఆహ్వానించిన బొరగం

ABN, First Publish Date - 2022-11-17T15:16:17+05:30

జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకున్నారు. దొరమామిడి పంచాయతీ, చిన్నజిడిపూడి, పెద్దజిడిపూడి, దొరమామిడి డ్యాం కాలనీకి చెందినవారికి నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ.. పార్టీలో చేరినవారికి సముచిత స్థానం కల్పిస్తానని, పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని అన్నారు. టీడీపీ గెలిచిన వెంటనే గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యే దిశగా అందరూ కష్టపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, నియోజకవర్గం ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు, యుకెడి బాబు, కారంపూడి ఆదినారాయణ, పఠాన్ రసూల్ ఖాన్, కోమిటీ పద్మరాజు, అలిషా, భాషా, దువ్వేల సంకురుడు, మాజీ ఎంపిటిసి సొదెం దుర్గారావు, మడకం నాగేశ్వరరావు, సోదేం మల్లయ్య, కరకాల తమ్మిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మానెల్లి బాలుతదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T15:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising