Elon Musk Warning: అలాచేస్తే ట్విటర్ ఖాతా శాశ్వతంగా తొలగింపు.. మస్క్ సీరియస్ వార్నింగ్!
ABN, First Publish Date - 2022-11-08T09:25:45+05:30
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ (Twitter) తన చేతికి వచ్చిన తర్వాత నుంచి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) దూకుడు పెంచిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ (Twitter) తన చేతికి వచ్చిన తర్వాత నుంచి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. కీలక మార్పులతో అటు ఉద్యోగులతో పాటు ఇటు ఖాతాదారులను కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మస్క్ ప్రధానంగా ఆదాయ మార్గాలపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే బ్లూటిక్ ఖాతాలకు నెలకు 8డాలర్ల చొప్పున ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే, బ్లూటిక్ ఖాతాలకు నెలకు 8డాలర్ల చొప్పున వసూలును తప్పుబడుతూ కొందరు తమ ట్విటర్ హ్యాండిళ్లలో మస్క్ ఫొటో, పేరు పెట్టి నిరసన తెలుపుతున్నారు. దీనిపై ట్విటర్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ 'డిస్‌ప్లే'లో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే.. అలాంటి ఖాతాలను శాశ్వతంగా ట్విటర్ నుంచి తొలిస్తామని మస్క్ తాజాగా వార్నింగ్ ఇచ్చారు. అంతేగాక గతంలో మాదిరి ఖాతా తొలిగింపునకు ముందు ఎలాంటి హెచ్చరికలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
మస్క్ వార్నింగ్ ట్వీట్..
కొంత మంది ప్రముఖులు తమ 'డిస్‌ప్లే' పేరును ఎలాన్ మస్క్‌గా మార్చి, వారి ఖాతాకు ఆయన ఫొటో పెట్టి ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. "ట్విటర్ డిస్‌ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే శాశ్వతంగా ట్విటర్ నుంచి ఆ ఖాతాను తొలగిస్తాం. ట్విటర్ ఖాతాల తొలగింపు, నిలిపివేయడం వంటి విషయాల్లో గతంలో ముందుగా హెచ్చరికలు చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ ఉండవు. ఏ ఇతర పేరుకు తమ డిస్ ప్లేను మార్చినా, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్‌ను తాత్కాలికంగా కోల్పోతారు" అని ఖాతాదారులను హెచ్చరిస్తూ మస్క్ ట్వీట్ చేశారు.
Updated Date - 2022-11-08T09:46:09+05:30 IST