ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ITR filling: ఐటీఆర్ దాఖలకు ఇంకా 3 రోజులే గడువు.. మిస్సయితే జరిగేది ఇదే !

ABN, First Publish Date - 2022-12-28T19:16:47+05:30

అంచనా ఏడాది 2022-23కి (assessment year) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు (ITR filling) ఆలస్య గడువు డిసెంబర్ 31, 2022తో ముగిసిపోనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంచనా ఏడాది 2022-23కి (assessment year) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలకు (ITR filling) ఆలస్య గడువు డిసెంబర్ 31, 2022తో ముగిసిపోనుంది. ఇప్పటికీ దాఖలు చేయని చెల్లింపుదారులు ఎవరైనా ఉంటే ఈ మూడు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపశమనం పొందొచ్చు. ఒకవేళ డిసెంబర్ 31, 2022లోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే మాత్రం పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ పేయర్స్ ఏం చేయాల్సి ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం..

చెల్లింపుదార్లు చేయాల్సింది ఇదే..

జనవరి 1, 2023 నుంచి ఐటీఆర్ దాఖలు సాధారణ పద్ధతిలో ఉండదు. చెల్లింపుదార్లు స్వచ్ఛందంగా ఫైలింగ్ చేయడం సాధ్యపడదు. ఆదాయ పన్ను విభాగానికి విజ్ఞప్తి చేసుకుని అనుమతి పొంది ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. లేదా ఆదాయ పన్ను వివరాల పరిశీలన సమయంలో ఏం చేయాలనుకుంటున్నది ఐటీ అధికారుల వద్ద చెప్పవచ్చు.

వాస్తవానికి అంచనా ఏడాది 2022-23కు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్(ITR) సాధారణ దాఖలు గడువు జులై 31, 2022గా ఉంది. సాధారణ దాఖలుపై ఎలాంటి జరిమానా ఉండదు. ఏప్రిల్ నుంచి జులై వరకు పన్ను బకాయిలపై ప్రతి నెలా 1 శాతం వడ్డీతో ఫైలింగ్ చేయవచ్చు. ఇక జులై 31 నుంచి డిసెంబర్ 31, 2022 వరకు ఆలస్య రుసుము రూ.1000 లేదా రూ.5000 జరిమానాతోపాటు పన్ను బకాయిలపై 1 లేదా 2 శాతం వడ్డీతో దాఖలు చేసే వీలుంటుంది. ఇక జనవరి 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు 25 శాతం అదనపు ట్యాక్స్‌తో ఐటీఆర్‌ అప్‌డేట్ చేసుకోవచ్చు. మరోవైపు.. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు అదనపు ట్యాక్స్‌తో రిటర్న్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. చెల్లించాల్సిన బకాయిలు, వడ్డీపై 50 శాతం అదనపు ట్యాక్స్‌తో అవకాశం ఉంటుంది. అయితే ఐటీఆర్ అప్‌డేట్‌కుగానూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది

Updated Date - 2022-12-28T19:39:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising