ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fixed Deposit Interest Rate: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. పెరుగుతున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

ABN, First Publish Date - 2022-11-26T20:15:09+05:30

గత కొన్ని రోజులుగా బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు ఇతర డిపాజిటర్ల వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు ఇతర డిపాజిటర్ల వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ వారం డీబీఎస్ బ్యాంక్ (DBS Bank), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank Of India) ఎఫ్‌డీ రేట్లను పెంచాయి. యూనియన్ బ్యాంకు పెంచిన ఎఫ్‌డీ రేట్ల (FD Rates) నేటి నుంచి (25వ తేదీ) అమల్లోకి వచ్చాయి. ఇప్పుడీ బ్యాంకు రెగ్యులర్ డిపాజిటర్లకు 800 రోజులు, మూడు సంవత్సరాల డిపాజిట్లకు 7.3 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తుండగా, సీనియర్ సిటిజన్లకు ఇదే కాలపరిమితికి గాను 0.5 శాతం అధికంగా 7.8 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

* డీబీఎస్ బ్యాంకు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను 600 రోజుకు 0.75 శాతం పెంచింది. అంటే ఇప్పుడు ఆ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే, మూడు నుంచి 4 సంవత్సరాలు, 4 నుంచి 5, 5 నుంచి ఆపైన కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. డీబీఎస్ వడ్డీ రేట్లు ఈ నెల 18 నుంచే అమల్లోకి వచ్చాయి.

* ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Ujjivan Small Finance Bank ) సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు 8.75 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు ప్రకటించగా, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిటజన్ల డిపాజిట్లపై 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

* 725 రోజుల కాలపరిమితి కలిగిన సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు ఆర్‌బీఎల్ బ్యాంకు (RBL Bank) 7.75 శాతం వడ్డీని ప్రకటించింది.

* 777 రోజుల కాలపరిమితి కలిగిన సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చింది.

* 750 రోజుల సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) 7 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 10 నుంచే ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.

* మూడేళ్ల నుంచి పదేళ్ల కాలబుల్ డిపాజిట్స్ (కాలపరిమితికి ముందే ఉపసంహరించుకునే)పై ఎస్‌బీఎం బ్యాంక్ (SBM Bank) 7.1 శాతం, ముందుగా ఉపసంహరించుకునే వీలు లేని (నాన్-కాలబుల్) డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వచ్చాయి.

*36 నెలల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన సీనియర్ సిటిజన్లు డిపాజిట్లపై యస్ బ్యాంక్ (Yes Bank) 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా 1.5 సంవత్సరాల నుంచి మూడేళ్ల డిపాజిట్లపై 7.25 వడ్డీ ఇస్తోంది. ఈ నెల 3 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

* 750 రోజుల డిపాజిట్లపై ఐడీఎఫ్‌సీ బ్యాంక్ (IDFC Bank) 7.75 వడ్డీ రేటు ఇస్తుండగా, 501 నుంచి 749 రోజుల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. అక్టోబరు 10 నుంచే ఈ వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

* 366 నుంచి 1095 రోజుల సీనియర్ సిటిజెన్స్ డిపాజిట్లపై నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (North East Small Finance Bank) 7.5 శాతం వడ్డీ ఇస్తుండగా, 1096 నుంచి 1110 రోజుల డిపాజిట్లపై ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 7.75 శాతం వడ్డీ ఇస్తోంది.

Updated Date - 2022-11-26T20:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising