ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhyahna bhojanam ఎందుకు నచ్చట్లేదు? విద్యార్థులకు ప్రశ్న!?

ABN, First Publish Date - 2022-12-31T11:28:15+05:30

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం సొలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శుక్రవారం పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ (Principal Secretary School Education Praveen Prakash) ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మౌలికవసతులు, నాడు-నేడు (Nadu-nedu)లో జరిగిన పనులు, ఆర్వో ప్లాంటు, ల్యాబ్‌, తరగతి గదులను పరిశీలించారు. మెనూ(menu) ప్రకారం

ఎందుకు నచ్చట్లేదు?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి నుంచి భోజనమా?

ప్రభుత్వ మధ్యాహ్న భోజనం ఎందుకు తినట్లేదు?

విద్యార్థులకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రశ్న

దొడ్డు బియ్యమే కారణమన్న హెచ్‌ఎంపై ఆగ్రహం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశం

ప్రభుత్వం అందించే బియ్యం తింటే మంచిదని..

తల్లిదండ్రులకు చెప్పాలని టీచర్లకు ప్రవీణ్‌ప్రకాశ్‌ సూచన

యడ్లపాడు/వినుకొండ టౌన్‌, డిసెంబరు 30: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం సొలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శుక్రవారం పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ (Principal Secretary School Education Praveen Prakash) ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మౌలికవసతులు, నాడు-నేడు (Nadu-nedu)లో జరిగిన పనులు, ఆర్వో ప్లాంటు, ల్యాబ్‌, తరగతి గదులను పరిశీలించారు. మెనూ(menu) ప్రకారం ఆహారం పెడుతున్నారా? గుడ్డు, చిక్కీలు ఇస్తున్నారా అని విద్యార్థులను ప్రశ్నించారు. కొందరు విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలోని చెట్ల కింద కూర్చొని ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్సుల్లోని భోజనం తినడాన్ని ఆయన గమనించారు. విద్యార్థులంతా పాఠశాలలో మధ్యాహ్న భోజనం (Madhyahna bhojanam) ఎందుకు చేయడం లేదని హెచ్‌ఎం శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దొడ్డురకం బియ్యం కావడంతో సగంమంది విద్యార్థులు ఇంటినుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారని హెచ్‌ఎం వివరించారు. దీంతో ‘డోన్ట్‌ సే లైక్‌ దట్‌’ అంటూ హెచ్‌ఎంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. 8వ తరగతికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. గణితంలో రేఖీయ సమీకరణాలు పాఠ్యాంశం నుంచి ఒక లెక్కను ఇచ్చి చేయమన్నారు. తరగతిలోని 30 మందిలో 8మంది మాత్రమే ఆన్సర్‌(Answer) చేయగలిగారు. కనీసం 60శాతం విద్యార్థులు జవాబు రాయగలిగేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆయన సూచించారు. కాగా, పల్నాడు జిల్లా వినుకొండలోని కస్తూర్బా గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే 95శాతం మేర ట్యాబ్‌(tabs)లు పంపిణీ చేశామన్నారు. పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రశ్నాపత్రాలను వేర్వేరుగా అందజేస్తామన్నారు. హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరతపై మాట్లాడుతూ కొందరు టీచర్లు(Teachers) కోర్టును ఆశ్రయించడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. హిందీ ఉపాధ్యాయుల బదిలీ జరగలేదన్న విషయం తనకు తెలియదన్నారు. ప్రభుత్వం అందించే బియ్యం తినడం వల్ల విద్యార్థులకు ఎంతో మంచిదని తల్లిదండ్రులకు సూచించాలని, అన్ని రాష్ర్టాల కంటే ఏపీ(ap)లోని పాఠశాలల్లో అందించే బియ్యం నాణ్యతతో కూడుకున్నవని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులకు క్లాస్‌

ప్రవీణ్‌ప్రకాశ్‌కు స్వాగతం పలికేందుకు పాఠశాల ప్రత్యేకాధికారి రత్నశిరోమణి ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లను గమనించిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలకడం, బొకేలు ఇవ్వడం, పూలు చల్లడం మంచి పద్ధతి కాదన్నారు. నాడు-నేడు పనుల నాణ్యత ప్రమాణాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2022-12-31T11:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising