AP NIT: తాడేపల్లిగూడెంలో కీచక పర్వం!
ABN, First Publish Date - 2022-10-29T13:02:31+05:30
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్(Tadepalligudem nit)లో విద్యార్థినులపై వేధింపుల పర్వం వెలుగుచూసింది. బయోటెక్నాలజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న తమిళ మణి విద్యార్థినుల పట్ల అసభ్యంగా

విద్యార్థినులతో అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన
ఆందోళనకు దిగిన విద్యార్థులు
తాడేపల్లిగూడెం క్రైం, అక్టోబర్ 28: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్(Tadepalligudem nit)లో విద్యార్థినులపై వేధింపుల పర్వం వెలుగుచూసింది. బయోటెక్నాలజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న తమిళ మణి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులంతా కలిసి శుక్రవారం పరిపాలనా భవనం ముందు ధర్నాకు దిగారు. ఆ ఫ్యాకల్టీని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో క్యాంపస్(AP NIT)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడేపల్లిగూడెం సీఐ నాగరాజు అక్కడకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమించాలని సూచించారు. వేధింపులపై విద్యార్థినులు ఆయనకు ఫిర్యాదు చేశారు. సీఐ.. నిట్ అధికారులతో మాట్లాడగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్యాకల్టీ తమిళ మణిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం ఇచ్చారు.
Updated Date - 2022-10-29T13:11:20+05:30 IST