ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం మాదే..కాంగ్రెస్ ధీమా

ABN, First Publish Date - 2022-11-12T12:28:21+05:30

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) శాసనసభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) శాసనసభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే, ఈసారి మాత్రం సంప్రదాయానికి భిన్నంగా ఓటర్లకు తమకు వరుసగా రెండోసారి కూడా పట్టం కడతారని బీజేపీ చెబుతోంది. అయితే, ఓటర్ల సంప్రదాయంపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ (Himachal Congress) మాత్రం ఈసారి తాము అధికారంలోకి రావడం తథ్యమని చెబుతోంది. మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా హిమాచల్ ప్రదేశ్‌పై ఆశలు పెట్టుకుంది.

ఈ నేపథ్యంల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విక్రమాదిత్య, ప్రతిభాసింగ్‌లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. విజయంపై చాలా నమ్మకం ఉందని, ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని ప్రతిభాసింగ్ పేర్కొన్నారు. సంప్రదాయంపైనే తాము నమ్మకం పెట్టుకోలేదన్న విక్రమాదిత్య.. బీజేపీ నెరవేర్చని హామీలు కూడా తమ విజయానికి కారణమవుతాయని అన్నారు. విజయంపై తాము 100 శాతం నమ్మకముందని ఆయన పేర్కొన్నారు. 2017 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదని అన్నారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు.

రాష్ట్రంలోని 68 స్థానాలకు 412 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ కొనసాగుతోంది. 55 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో (Himachal Elections) విజయం సాధించడం ద్వారా పడిపోతున్న గ్రాఫ్‌ను నిలబెట్టుకోవాలని, పార్టీలో పునరుజ్జీవం తీసుకురావాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

Updated Date - 2022-11-12T12:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising