ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taliban's order : మహిళా ఉద్యోగులను నియమించుకోవద్దు : తాలిబన్లు

ABN, First Publish Date - 2022-12-24T20:17:04+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో పని చేస్తున్న స్థానిక, విదేశీ ప్రభుత్వేతర సంస్థలు (NGOs) మహిళా ఉద్యోగులను నియమించుకోరాదని

Taliban
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో పని చేస్తున్న స్థానిక, విదేశీ ప్రభుత్వేతర సంస్థలు (NGOs) మహిళా ఉద్యోగులను నియమించుకోరాదని తాలిబన్లు ఆదేశించారు. మహిళలకు నిర్దేశించిన ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను కొందరు అనుసరించడం లేదని చెప్తూ, తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకు మహిళలను నియమించుకోవద్దని ఆఫ్ఘన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇది మహిళల హక్కులపై దాడి అని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

తాలిబన్లు కొద్ది రోజుల క్రితం విశ్వవిద్యాలయాల్లోకి మహిళలకు ప్రవేశం లేదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రధాన నగరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు తాలిబన్ భద్రతా దళాలు వాటర్ కెనన్లను ప్రయోగించారు. తాలిబన్లు గత ఏడాది ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరగడం చాలా అరుదు.

విశ్వవిద్యాలయాల్లోకి మహిళల ప్రవేశాన్ని తాలిబన్లు నిషేధించడాన్ని సౌదీ అరేబియా (Saudi Arabia), టర్కీ (Turkey), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates), ఖతార్ (Qatar) తీవ్రంగా ఖండించాయి. ఈ నిషేధం పర్యవసానాలను తాలిబన్లు (Taliban) ఎదుర్కొనవలసి ఉంటుందని అమెరికా, జీ7 దేశాలు హెచ్చరించాయి.

Updated Date - 2022-12-24T20:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising