ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIA : కోయంబత్తూరు కారు బాంబు కేసులో మరో సంచలనం

ABN, First Publish Date - 2022-12-28T20:29:41+05:30

తమిళనాడులోని కోయంబత్తూరులో రెండు నెలల క్రితం జరిగిన కారు బాంబు పేలుడు కేసులో మరో ఇద్దరు టెర్రర్ ఆపరేటివ్స్‌ను

Tamil Nadu Car Bomb Blast Case
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడులోని కోయంబత్తూరులో రెండు నెలల క్రితం జరిగిన కారు బాంబు పేలుడు కేసులో మరో ఇద్దరు టెర్రర్ ఆపరేటివ్స్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం అరెస్ట్ చేసింది. గతంలో ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసింది. వీరంతా 2022 ఫిబ్రవరిలో రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా, సత్యమంగళం అడవిలో నేరపూరిత కుట్ర పన్నారని తెలిపింది.

ఎన్ఐఏ అధికారులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో గతంలో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. బుధవారం షేక్ హిదయతుల్లా, సనోఫార్ అలీలను అరెస్టు చేశారు. నిందితులంతా ఫిబ్రవరిలో ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం అడవిలో, అసనూర్, కడంబూర్ ప్రాంతాల్లో సమావేశమై, నేరపూరిత కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఈ సమావేశాలను గతంలో అరెస్టయిన నిందితుడు ఉమర్ ఫరూఖ్ నిర్వహించాడు. జమీషా ముబీన్, మహమ్మద్ అజారుద్దీన్, షేక్ హిదయతుల్లా, సనోఫార్ అలీ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఉగ్రవాద చర్యలకు సిద్ధమవాలని, వాటిని అమలు చేయాలని వీరంతా కుట్ర పన్నారు.

2022 అక్టోబరు 23న సాయంత్రం 4.30 గంటలకు కోయంబత్తూరులో ఓ మారుతి 800 కారులో ఎల్‌పీజీ సిలిండర్ పేలింది. కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడులో జమీషా ముబీన్ (25) మరణించాడు. ప్రారంభంలో ఇది ప్రమాదం అని అనుకున్నారు. కానీ దర్యాప్తు తర్వాత దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు మాట్లాడుతూ, పేలుడు జరిగిన వాహనంలో మేకులు, చలువరాళ్లు, ఇతర వస్తువులు దొరికాయని చెప్పారు. వీటిని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ పరీక్షిస్తోందన్నారు. నిందితుని ఇంట్లో సోదాలు నిర్వహించినపుడు, తక్కువ తీవ్రత గల పేలుడు పదార్థాలను గుర్తించామన్నారు. దేశవాళీ బాంబుల తయారీకి ఉపయోగపడే పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పొడి, చార్కోల్, సల్ఫర్ కనిపించాయన్నారు.

ముబిన్ ఐసిస్ ఉగ్రవాద సంస్థకు విధేయత ప్రకటించాడని పోలీసులు తెలిపారు. ఆత్మాహుతి దాడి చేయడం కోసం అతను ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం కోసం దేవాలయానికి పెద్ద ఎత్తున నష్టం కలిగే విధంగా దాడి చేయాలని ప్రయత్నించాడని ఆరోపించారు.

Updated Date - 2022-12-28T20:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising