ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra: రాహుల్ యాత్రలో వివాదాస్పద బాబా

ABN, First Publish Date - 2022-12-03T19:32:51+05:30

దేశప్రజల ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: దేశప్రజల ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు సంఘీభావంగా యాత్రలో పాల్గొంటున్నారు. అగర్ మాల్వా జిల్లా మహుడియా గ్రామంలో రాహుల్ గాంధీ పాత్రయాత్రలో వివాదాస్పద గాడ్‌మన్ నామ్‌దేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. రాహుల్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపు పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.

బీజేపీ విమర్శలు..

భూఆక్రమణల కేసులో గతంలో అరెస్టయిన కంప్యూటర్ బాబాను యాత్రలో భాగం ఎలా చేస్తారని బీజేపీ ప్రశ్నించారు. 2002లో ఇండోర్ సమీపంలోని కంప్యూటర్ బాబా ఆశ్రయం వద్ద అక్రమ నిర్మాణం కూల్చివేతకు వచ్చిన పంచాయతీ సిబ్బందిపై ఆయన చేయి చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నరేంద్ర సలూజా సైతం రాహుల్ యాత్రను నిలదీశారు. ''కన్హయ్య కుమార్, నటుడు స్వరభాస్కర్ తర్వాత ఇప్పుడు కంప్యూటర్ బాబా వంతు వచ్చింది. ఇది ఏ తరహా పాదయాత్ర?'' అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో కంప్యూటర్ బాబా నిందితుడని, జైలు జీవితం కూడా గడిపారని అన్నారు.

బీజేపీకి దీటైన జవాబిచ్చిన కాంగ్రెస్

భారత్ జోడో యాత్రలో ఎంతో మంది సాధువులు, మతనాయకులు పాలు పంచుకుంటున్నారని, దేశ ప్రయోజనాల కోసం చేపట్టే ఈ యాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చని కాంగ్రెస్ మాజీ మంత్రి రాజ్‌కుమార్ పటేల్ అన్నారు. బీజేపీ ఎలాంటి ఆరోపణలు అయినా చేసుకోవచ్చని, ఎవరూ అడ్డుకోరని అన్నారు. 2018లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో కంప్యూటర్ బాబాకు సమహాయ మంత్రి హోదా ఇచ్చారు. రీవర్ కన్జర్వేషన ట్రస్టుకు చైర్మన్‌గా ఆయనను నియమించారు. నర్మదా నదిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, రీవర్‌ సర్వేకు తనకు హెలికాప్టర్ ఇవ్వాలని ఆయన కోరడంతో బీజేపీతో ఆయనకున్న సంబంధాలు బెడిసికొట్టాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంప్యూటర్ బాబా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు.

Updated Date - 2022-12-03T19:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising