Donald Trump : డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ అకౌంట్ పునరుద్ధరణ... ఎలన్ మస్క్ ఏం చేశారంటే...
ABN, First Publish Date - 2022-11-19T12:18:33+05:30
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? చెప్పాలని
శాన్‌ఫ్రాన్సిస్కో : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? చెప్పాలని ట్విటరాటీలను ఎలన్ మస్క్ (Elon Musk) కోరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో కేపిటల్ భవనంపై దాడి జరగడంతో ట్రంప్ ఖాతాను ట్విటర్ నిషేధించిన సంగతి తెలిసిందే.
ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించే అంశంపై అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతూ ఎలన్ మస్క్ ట్విటర్ పోల్ నిర్వహిస్తున్నారు. ఆయన ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ పోల్ మరో 18 గంటల్లో ముగియనున్న సమయానికి 62,33,481 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో దాదాపు 54 శాతం మంది ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలని చెప్పారు. ప్రజల గళమే దైవ గళమని మరొక ట్వీట్‌లో మస్క్ పేర్కొన్నారు.
మస్క్ శుక్రవారం మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఆయన మాట్లాడినపుడు ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తానని చెప్పారు. ఇదిలావుండగా, సెటైరికల్ వెబ్‌సైట్ బాబిలోన్ బీ, కమెడియన్ కేథీ గ్రిఫిన్ వంటివారి కొన్ని వివాదాస్పద ట్విటర్ ఖాతాలను మస్క్ పునరుద్ధరించారు.
ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న అమెరికా కేపిటల్ భవనంపై దాడి, హింసాకాండలకు పాల్పడ్డారు. దీంతో ఆయన ఖాతాను ట్విటర్ శాశ్వతంగా నిషేధించింది.
Updated Date - 2022-11-19T12:18:39+05:30 IST