ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Twitter blue tick : ఇండియన్ యూజర్లకు బ్లూ టిక్ వెరిఫికేషన్ మరింత భారం!

ABN, First Publish Date - 2022-11-11T14:53:18+05:30

ఎలన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్విటర్‌లో జరుగుతున్న మార్పుల

Elon Musk
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఎలన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్విటర్‌లో జరుగుతున్న మార్పుల ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా ఉంటోంది. ట్విటర్ అకౌంట్ల బ్లూ టిక్ వెరిఫికేషన్ (Twitter blue tick Verification) కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని ట్విటర్ నుంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి. అయితే ఈ రుసుము ఇండియన్ యూజర్లకు 8.91 డాలర్లు అవుతోంది.

ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు iOS App Store ఇండియన్ యూజర్స్‌కు కనిపిస్తున్నాయి. బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం నెలకు రూ.719 (అంటే 8.91 డాలర్లు) చెల్లించాలని ఈ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ సొమ్మును చెల్లించనివారి ట్విటర్ ఖాతాలోని వెరిఫికేషన్ టిక్‌ను ట్విటర్ తొలగిస్తుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను వసూలు చేయడం నవంబరు 10 నుంచి ప్రారంభమైంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చునని ట్విటర్ తెలిపింది. గడువు ముగియడానికి ఒక రోజు ముందు రద్దు చేసుకోవచ్చునని, అలా కాని పక్షంలో రద్దు చేసే వరకు రెన్యువల్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని తెలిపింది.

ట్విటర్ బ్లూ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని ఎలన్ మస్క్ కరాఖండీగా చెప్పేశారు. అయితే భారతీయ యూజర్లు రూ.719 చెల్లించాలని ట్విటర్ నోటిఫికేషన్ చెప్తోంది. శుక్రవారం నాడు రూ.719 అంటే 8.91 డాలర్లు. దీనినిబట్టి ఇండియన్ యూజర్లు 0.91 డాలర్లు లేదా 73 రూపాయలు ఎక్కువగా చెల్లించవలసి వస్తోంది.

ఆయా దేశాల్లోని ప్రజల కొనుగోలు శక్తికి అనుగుణంగా ఈ రుసుమును వసూలు చేస్తామని ఎలన్ మస్క్ గతంలో చెప్పారు. దానినిబట్టి లెక్క వేస్తే, మన దేశంలో నెలకు సుమారు రూ.185 మాత్రమే వసూలు చేయవలసి ఉంటుంది. కానీ ఆయన మాటలకు, చేతలకు పొంతన లేకుండా రూ.719 చెల్లించాలని నోటిఫికేషన్లు వస్తున్నాయి. యూజర్ల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు వస్తే, ఈ రుసుము తగ్గవచ్చునేమోనని కొందరు ఆశిస్తున్నారు. అయితే ట్విటర్ నుంచి దీనిపై అధికారిక స్పందన ఏదీ రాలేదు.

Updated Date - 2022-11-11T15:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising