ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP : కంగన రనౌత్‌కు జేపీ నడ్డా గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2022-10-30T10:04:04+05:30

భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరుతానన్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ (Kangana Ranaut)‌కు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా

Kangana Ranaut JP Nadda
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరుతానన్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ (Kangana Ranaut)‌కు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే తాను బీజేపీలో చేరుతానని ఆమె చెప్పిన నేపథ్యంలో నడ్డా ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడంపై సంప్రదింపుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఓ మీడియా సంస్థ హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరూ మాట్లాడారు.

కంగన రనౌత్ శనివారం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాజకీయాల్లో చేరేందుకు తాను సుముఖమేనని చెప్పారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని మండీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని చెప్పారు.

ఆ తర్వాత జేపీ నడ్డా ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. కంగన రనౌత్ చెప్పిన మాటలను ఆయన వద్ద ప్రస్తావించినపుడు ఆయన స్పందిస్తూ, ‘‘కంగన రనౌత్ మా పార్టీలో చేరాలనుకుంటే ఆమెకు స్వాగతం. పార్టీతో కలిసి పని చేయాలనుకునేవారెవరికైనా మంచి అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం విషయానికి వస్తే, అది నా ఒక్కడి నిర్ణయం కాదు. దాని కోసం క్షేత్ర స్థాయి నుంచి, ఎన్నికల కమిటీ, ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు వరకు సంప్రదింపుల ప్రక్రియ ఉంది’’ అని చెప్పారు.

బీజేపీలో చేరాలనుకునే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తామన్నారు. అయితే వారు ఏ హోదాలో ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. షరతులపై తాము ఎవరినీ తీసుకోబోమని చెప్పారు. ‘‘మీరు బేషరతుగా రండి, అప్పుడు పార్టీ మాత్రమే నిర్ణయిస్తుందని అందరికీ చెబుతాం’’ అని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో తాము ట్రెండ్‌సెటర్స్‌మని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మళ్ళీ బీజేపీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 68 శాసన సభ స్థానాలు గల ఈ రాష్ట్రంలో ఎన్నికలు నవంబరు 12న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ కనిపిస్తోంది.

Updated Date - 2022-10-30T10:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising